Water: చాలా మందికి భోజనం చేసే ముందు లేదా తిన్న వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది. కానీ, ఈ అలవాటు ఆరోగ్యానికి హానికరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల జీర్ణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని, దీనివల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని వైద్యులు చెబుతున్నారు.
జీర్ణవ్యవస్థపై ప్రభావం:
ఆహారం తిన్న వెంటనే మన శరీరం జీర్ణక్రియను ప్రారంభించడానికి ఎంజైమ్‌లు, ఆమ్లాలను ఉత్పత్తి చేస్తుంది. మీరు నీరు తాగినప్పుడు, ఈ ఎంజైమ్‌లు పలుచబడి ఆహారం సరిగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం, కడుపు ఉబ్బరం, అసిడిటీ వంటి సమస్యలు వస్తాయి. జీర్ణక్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల ఆహారంలోని పోషకాలను శరీరం సరిగా గ్రహించలేదు. ఇది పోషకాల లోపానికి కూడా దారితీస్తుంది.
Also Read: Cardamom Benefits: ఖాళీ కడుపుతో యాలకులు తింటే ఏం జరుగుతుందో తెలుసా?
బరువు పెరిగే అవకాశం:
భోజనం చేసిన వెంటనే నీరు తాగడం వల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది. నీరు కడుపును నింపినట్లు అనిపిస్తుంది, కానీ ఆహారం సరిగా జీర్ణం కాకపోవడం వల్ల త్వరగా మళ్లీ ఆకలి వేస్తుంది. దీంతో ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంది, ఫలితంగా బరువు పెరుగుతారు.
ఎప్పుడు నీరు తాగాలి?
నిపుణుల సూచనల ప్రకారం, భోజనం చేయడానికి అరగంట ముందు లేదా భోజనం చేసిన 45-60 నిమిషాల తర్వాత మాత్రమే నీరు తాగాలి. ఈ సమయాన్ని పాటించడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరిగి, శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. భోజనం చేస్తున్నప్పుడు కూడా వీలైనంత తక్కువ నీటిని తాగడం మంచిది. ఈ చిన్నపాటి మార్పుతో జీర్ణక్రియ సమస్యలను నివారించవచ్చు.
గమనిక:
ఈ సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంటే వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.