Dragon

Dragon: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్’లో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఎంట్రీ.. ఎన్టీఆర్ తల్లిగా?

Dragon: ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా పై ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రంలో బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కీలక పాత్ర పోషించనున్నట్టు సమాచారం. ఫ్లాష్‌బ్యాక్ సన్నివేశాల్లో ఆమె ఎన్టీఆర్‌కు తల్లిగా కనిపించనుందట. అయితే ఈ వార్తలో నిజానిజాలు ఏమిటో తెలియాలి. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.

Also Read: Lenin: అఖిల్ ‘లెనిన్’ షూటింగ్ పూర్తి!

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా పై ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లు ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకి KGF, సలార్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై ఓ రూమర్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ కాజోల్ ఈ చిత్రంలో నటించనున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ల్లో ఆమె హీరో ఎన్టీఆర్‌కు తల్లి పాత్రలో కనిపించనుందట. అయితే ఈ వార్త అధికారికంగా ధృవీకరించబడలేదు. మరి ఈ రూమర్‌లో ఎంత వాస్తవం ఉందో చూడాలి. ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎన్టీఆర్ కెరీర్‌లో అత్యుత్తమ చిత్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నాడు. స్క్రిప్ట్ పై చాలా సమయం తీసుకున్నాడు. ఇప్పటివరకు నీల్ తీసిన చిత్రాల్లో ఇదే బెస్ట్ అవుతుందనే అంచనాలు ఉన్నాయి. అయితే ఈ సినిమాపై లీకుల రూపంలో అనేక రూమర్లు వస్తూనే ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *