Double Ismart: తెలుగులో విజయం సాధించని చాలా చిత్రాలు హిందీలో డబ్ అయ్యి, యూ ట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ ను అందుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా యంగ్ హీరోస్ రామ్ పోతినేని, బెల్లకొండ సాయి శ్రీనివాస్ చిత్రాలకు ఉత్తరాదిన ఊహించని క్రేజ్ ఉంది. తాజాగా రామ్ పోతినేని నటించిన పూరి జగన్నాథ్ మూవీ ‘డబుల్ ఇస్మార్ట్’ తెలుగులో ఫ్లాప్ అయ్యింది. ‘ఇస్మార్ట్ శంకర్’కు సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ బరిలో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. చిత్రంగా ఈ సినిమా సైతం హిందీలో 100 మిలియన్లకు పైగా వ్యూస్ ను దక్కించుకుంది. ఇదిలా ఉంటే… రామ్ ప్రస్తుతం మైత్రీ మూవీమేకర్స్ బ్యానర్ లో ఓ ప్రేమకథా చిత్రాన్ని చేస్తున్నాడు.
