Clay Pot: మన తాతాబామ్మలు ఆరోగ్యంగా జీవించడానికి కారణం వారి ఆహారం మాత్రమే కాదు, వారి వంట పద్ధతులు కూడా. అవును వాళ్ళు మట్టి కుండలలో వంట చేసుకోవడం, తినడం అలవాటు చేసుకున్నారు. అయితే కాలం మారుతున్న కొద్దీ, మట్టి కుండలలో వంట చేయడం చాలా తక్కువగా మారింది. ప్రత్యేకత ఏమిటంటే మట్టి కుండలలో వంట చేయడం తినడం ఇప్పుడు మళ్ళీ ప్రజాదరణ పొందింది. మట్టి కుండలో వండుకుని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే మట్టి కుండలో వంట చేసేటప్పుడు పాటించాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మట్టి కుండలను విడిగా ఉంచాలి
మీరు ఉపయోగించే మట్టి కుండలు, పాత్రలను ఇతర పాత్రలతో కాకుండా విడిగా ఉంచాలి. లేకపోతే అవి సులభంగా విరిగిపోవడం లేదా పగుళ్లు ఏర్పడతాయి. మీరు మట్టి కుండల కోసం ఒక ప్రత్యేక స్థలాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ముఖ్యంగా మట్టి కుండలను ఒకదానిపై ఒకటి పేర్చవద్దు.
చెక్క స్పూన్లు వాడాలి :
మట్టి పాత్రలలో వంట చేసేటప్పుడు ఎప్పుడూ మెటల్ స్పూన్లు ఉపయోగించవద్దు. అవి మట్టి కుండ లోపలి భాగానికి నష్టం కలిగిస్తాయి. బదులుగా చెక్క స్పూన్లు వాడితే మంచిది.
సబ్బు వాడొద్దు :
మట్టి కుండలను శుభ్రం చేసేటప్పుడు సబ్బు లేదా మెటల్ స్క్రబ్బర్లను ఉపయోగించవద్దు. సబ్బుతో కడుక్కోవడం వల్ల ఆహారం కలుషితమయ్యే ప్రమాదం పెరుగుతుంది. బదులుగా బేకింగ్ సోడా, ఉప్పు, కొబ్బరి పీచుతో శుభ్రం చేయవచ్చు.
Also Read: Health Tips: వీటిని పెరుగుతో కలిపి అస్సలు తినకండి !
పొడి ప్రదేశంలో ఉంచాలి :
మట్టి కుండను శుభ్రం చేసిన తర్వాత, దానిని ఆరబెట్టడానికి సరైన స్థలంలో ఉంచాలి. తేమ లేని ప్రదేశంలో ఎండబెట్టాలి. లేకపోతే పాత్ర పూర్తిగా పాడైపోతుంది. కాబట్టి మట్టి కుండను బాగా పొడిగా ఉన్న ప్రదేశంలో ఉంచండి.
సిట్రస్ ఆహారాలు వండొద్దు :
మట్టి పాత్రలలో సిట్రిక్ ఆహారాలను వండటం మానుకోవాలి. ఎందుకంటే సిట్రిక్ యాసిడ్ మట్టితో చర్య జరిపి వండిన ఆహారం రుచిని ప్రభావితం చేస్తుంది.
తక్కువ మంట మీద ఉడికించాలి :
మట్టి కుండలను ఇతర పాత్రల మాదిరిగా కాకుండా తక్కువ వేడి మీద ఉడికించాలి. ఎప్పుడూ ఎక్కువ వేడి మీద ఉడికించకండి. తక్కువ వేడి మీద వంట చేయడం వల్ల ఆహారానికి ప్రత్యేకమైన రుచిని ఇస్తుంది.