Astrology Tips: వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బుకు బదులుగా కొన్ని వస్తువులను మీ పర్సులో ఉంచుకోవడం వల్ల ఆర్థిక సమస్యలు పెరుగుతాయి. ఈ చిన్న విషయాలను పట్టించుకోకపోవడం వల్ల పేదరికం వస్తుంది. అంతే కాదు అది ప్రతికూల శక్తి ప్రభావాన్ని కూడా కలిగిస్తుంది.
అక్రమంగా సంపాదించిన డబ్బును ఎప్పుడూ పర్సులో ఉంచకూడదు. ఇలా చేయడం వల్ల డబ్బు క్రమంగా అయిపోతుంది. మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవలసి ఉంటుంది. ఈ అక్రమ సంపద మన సంతోషాన్ని, శాంతిని, శ్రేయస్సును తీసుకువెళ్తుంది.
పనికిరాని స్లిప్పులు, బిల్లులు: డబ్బుతో పాటు అనవసరమైన స్లిప్పులు, పాత బిల్లులు లేదా కాగితాలను మీ పర్సులో ఉంచుకోవడం మంచిది కాదు. ఇది ప్రతికూల శక్తిని పెంచుతుంది.
సంపదను కాపాడుకునే మార్గాలు: డబ్బు ఉంచే ప్రదేశం ఎల్లప్పుడూ శుభ్రంగా ఉండాలి. మీ పర్సులో ఎరుపు లేదా పసుపు రంగు వస్త్రం ఉంచుకోవడం శుభప్రదం. కుబేరుడు, లక్ష్మీ దేవిని క్రమం తప్పకుండా పూజించడం వల్ల సంపదలో శ్రేయస్సు లభిస్తుంది.
హిందూ సంప్రదాయంలో రావి చెట్టును ఎంతో పవిత్రంగా చూస్తారు. ఎంతో మంది ఈ చెట్టుకు పూజలు చేస్తారు. ముడుపులు కడతారు. ఇంత పవిత్రమైన చెట్టు ఆకులను మీ పర్సులో ఉంచుకుంటే.. ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని అంటున్నారు. వాలెట్ ఎప్పటికీ ఖాళీగా ఉండదని చెబుతున్నారు. అలాగే జీవితంలో విజయం వరిస్తుందని అంటున్నారు.

