Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు అతి పెద్ద ప్రమాదం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక సమస్య ఏర్పడటంతో గుర్తించిన సిబ్బంది అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం నుంచి ఆయన బయట పడ్డారు. దావోస్ పర్యటనకు బయలుదేరిన సందర్భంగా ఈ సంఘటన చోటు చేసుకున్నది.
Donald Trump: అమెరికా అధ్యక్షుడు ఈ రోజు (జనవరి 21) ఉదయం స్విట్జర్లాండ్ దావోస్ పర్యటన కోసం యూఎస్ బేస్‌కు చెందిన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో బయలుదేరారు. ఆయన ప్రయాణిస్తున్న విమానం టేకాఫ్ అయిన కొద్దిసేపటికే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. విమానం లోపల ఎలక్ట్రికల్ సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలెట్లు, ఇతర సాంకేతిక సిబ్బంది విమానాన్ని వెనక్కి మళ్లించి సురక్షితంగా ల్యాండ్ చేశారు.
Donald Trump: ఆ తర్వాత మరో విమానంలో డొనాల్డ్ ట్రంప్ దావోస్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయం ప్రపంచమంతా ఒక్కసారిగా తెలియడంతో ఉలికిపాటుకు గురైంది. అగ్రరాజ్యమైన అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే వాహనంలో సాంకేతిక సమస్యను ముందుగానే ఎందుకు గుర్తించలేదని చర్చించుకుంటున్నారు. ఈ ఘటనపై విచారిస్తున్నామని అమెరికా సైనికాధికారులు అక్కడి మీడియాకు వెల్లడించారు.
