Donald Trump: అమెరికా దేశంలో నివసిస్తున్న విదేశీయులకు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. బిగ్ బ్యూటీఫుల్ బిల్ పేరిట ఓ నూతన బిల్లును తీసుకొచ్చింది. ఈ బిల్లు ద్వారా అమెరికా నుంచి అక్కడి ఎన్ఆర్ఐలు తమ సొంత దేశాలకు పంపే నగదు బదిలీలపై 5 శాతం పన్ను వసూలు చేయాలని నిర్ణయించింది. దీంతో ఎన్ఆర్ఐలకు తీవ్రంగా నష్టం జరిగే అవకాశం ఉన్నది.
Donald Trump: ఈ బిల్లును ప్రతినిధుల సభ బడ్జెట్ కమిటీ సభలో ప్రవేశపెట్టేందుకు 21-16 ఓట్ల తేడాతో వ్యతిరేకించింది. రిపబ్లికన్లు కూడా ఈ బిల్లును వ్యతిరేకించారు. దాంతో సవరణలు చేసి బిల్లును తిరిగి ప్రతినిధుల సభలో ప్రవేశపెడతామని స్పీకర్ మైక్ జాన్సన్ ప్రకటించారు. ఈ బిల్లు కనుక ఆమోదం పొందితే అమెరికాలో సంపాదించిన డబ్బును వేరే దేశాల్లో ఉన్న తమ వారికి పంపే విదేశీయుల పన్నుల రూపంలో భారీగా చెల్లించాల్సి ఉంటుంది.
Donald Trump: ఈ బిల్లులో పేర్కొన్న విధానం ప్రకారం.. అమెరికాలో ఉన్న భారతీయులు తమ వారికి రూ.1160 డాలర్లు అంటే లక్ష రూపాయలను పంపాలని అనుకుంటే, ఐదు శాతంగా అంటే రూ.5 వేలను పన్ను రూపంగా అమెరికా దేశానికి చెల్లించాల్సి ఉంటుంది. ఈ పన్నును అమెరికా ప్రభుత్వ గుర్తింపు పొందిన బ్యాంకులతోపాటు నగదు బదిలీ సేవలను అందించే వెస్ట్రన్ యూనియన్, మనీగ్రామ్ వసూలు చేస్తాయి.
Donald Trump: హెచ్-1 బీ, ఎఫ్-1, జే-1 తదితర వీసాదారులు, గ్రీన్‌కార్డు హోల్డర్లు, తగిన గుర్తింపు పత్రాలు లేనివారు నగదు బదిలీలు చేసినప్పుడు ఈ పన్ను చెల్లించాల్సిందేనని నిబంధులను రూపొందించారు. అమెరికా పౌరసత్వం ఉన్నవారికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందితే భారతదేశానికి ఏటా వచ్చే నగదు నుంచి 1.6 బిలియన్ డాలర్లు నష్టపోనున్నారు.