Donald Trump

Donald Trump: డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయం

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌కు కొత్త రాయబారిని నియమించారు. వైట్‌హౌస్ ప్రెసిడెన్షియల్ పర్సనల్ ఆఫీస్ ప్రస్తుత డైరెక్టర్ అయిన సెర్గియో గోర్ను తదుపరి అమెరికా రాయబారిగా ఆయన నియమించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ‘ట్రూత్ సోషల్’ ద్వారా ఈ ప్రకటన చేశారు. సెర్గియో గోర్‌ను భారతదేశానికి రాయబారిగా, అలాగే దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలకు ప్రత్యేక రాయబారిగా నియమిస్తున్నట్లు తెలిపారు. ట్రంప్, గోర్‌ను తన ‘గొప్ప స్నేహితుడు’గా అభివర్ణించారు. గోర్ తన ఎజెండాను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తారని, పూర్తిస్థాయిలో నమ్మకస్తుడని పేర్కొన్నారు. 39 ఏళ్ల గోర్, భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన వారిలో అత్యంత పిన్న వయస్కుడు.

ఇది కూడా చదవండి: Australia: ఆస్ట్రేలియాకు ఘోర అవమానం.. ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే

సెర్గియో గోర్ నియామకానికి అమెరికా సెనేట్ ఆమోదం అవసరం. సెనేట్ ఆమోదం పొందే వరకు ఆయన వైట్‌హౌస్ పదవిలో కొనసాగుతారు. సెర్గియో గోర్, ఎరిక్ గార్సెట్టి స్థానంలో ఈ బాధ్యతలు స్వీకరించనున్నారు. ఎరిక్ గార్సెట్టి బిడెన్ ప్రభుత్వం తరపున రాయబారిగా పనిచేశారు. భారత్, అమెరికా మధ్య వాణిజ్యపరమైన ఉద్రిక్తతలు ఉన్న నేపథ్యంలో ఈ నియామకం ప్రాముఖ్యత సంతరించుకుంది.సెర్గియో, అతని టీమ్‌ చాలా తక్కువ సమయంలోనే తమని తాము దేశభక్తులుగా భావించుకునే 4000 మందిని నియమించుకున్నారు. ఈ నియామకాలు మా ఫెడరల్‌ ప్రభుత్వ శాఖలు, ఏజెన్సీల్లోని 95 శాతం ఉద్యోగాలను భర్తీ చేశాయి. భారత్‌కు వెళ్లేంతవరకు సెర్గియా ప్రస్తుతం వైట్‌హౌస్‌లో తన పాత విధులను నిర్వహిస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *