H-1B Visa

H-1B Visa: H-1B వీసా ఫీజుపై దావా.. ట్రంప్ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టుకు!

H-1B Visa: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొత్తగా ప్రకటించిన H-1B వీసా దరఖాస్తు రుసుము లక్ష డాలర్లను (సుమారు ₹88 లక్షలు) సవాలు చేస్తూ అమెరికాలోని ఒక ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూనియన్లు, యాజమాన్య సంస్థలు మరియు మతపరమైన సంస్థల సంకీర్ణం ఈ దావాను దాఖలు చేసింది. H-1B వీసా దరఖాస్తులపై విధించిన $100,000 వన్‌-టైమ్ ఫీజును నిలిపివేయాలని కోరారు. అయితే ఈ ఫీజు కొత్త H-1B దరఖాస్తులకు మాత్రమే వర్తిస్తుంది. అమెరికా రాజ్యాంగం ప్రకారం, ప్రజల నుంచి డబ్బు వసూలు చేయడానికి లేదా కొత్త రుసుములను విధించడానికి మాత్రమే అధికారం ఉంటుంది. అధ్యక్షుడికి ఏకపక్షంగా ఇలాంటి పన్నులు లేదా ఫీజులు విధించే అధికారం లేదని పిటిషనర్లు వాదించారు.

ఇది కూడా చదవండి: Karur Stampede: విజయ్ కు బిగ్ షాక్.. కరూర్ తొక్కిసలాటపై సిట్ దర్యాప్తు

ఈ చర్య చట్టవిరుద్ధం అని, ట్రంప్ తన పరిధికి మించి అధికారాలను ఉపయోగించారని దావాలో పేర్కొన్నారు. ఈ మార్పుల ద్వారా టెక్ కంపెనీలు ‘డబ్బు చెల్లించి పనిచేయించుకోవాలి’ లేదా ‘జాతీయ ప్రయోజనం కింద మినహాయింపు కోరాలి అనే పరిస్థితి వచ్చిందని, ఇది ఎంపిక చేసిన అమలుకు, అవినీతికి దారితీస్తుందని ఫిర్యాదుదారులు ఆరోపించారు. H-1B వీసా కార్యక్రమాన్ని కొన్ని సంస్థలు దుర్వినియోగం చేస్తున్నాయని, తక్కువ జీతాలకు విదేశీ ఉద్యోగులను నియమించడం ద్వారా అమెరికన్ ఉద్యోగులకు నష్టం కలుగుతోందని ట్రంప్ ప్రభుత్వం వాదించింది. కొత్త ఫీజు ఈ దుర్వినియోగాన్ని అరికట్టడానికి ఉద్దేశించినట్లు పేర్కొంది. ఈ కొత్త ఫీజు ముఖ్యంగా భారతదేశం, చైనా వంటి దేశాల నుండి అధిక నైపుణ్యం కలిగిన నిపుణులను నియమించుకునే టెక్ మరియు ఇతర రంగాలలోని కంపెనీలపై, ముఖ్యంగా చిన్న సంస్థలపై తీవ్ర ప్రభావం చూపుతుంది

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *