Dominic and the Ladies’ Purse: సీనియర్ మలయాళీ స్టార్ హీరో మమ్ముట్టి సైతం తగ్గేదే లే అంటున్నారు. జనవరి 23న ఆయన నటించిన కామెడీ ఎంటర్ టైనర్ ‘డోమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’ మూవీ విడుదల కాబోతోంది. ఇందులో మమ్ముట్టి డిటెక్టివ్ పాత్రను పోషించారు. విశేషం ఏమంటే… ఈ మూవీ విడుదలైన మూడు వారాలకే మరో సినిమా రిలీజ్ కాబోతోంది. అదే ‘బజూకా’. మమ్ముట్టి, గౌతమ్ మీనన్ కీలక పాత్రలు పోషించిన ఈ గేమ్ థ్రిల్లర్ ను డీనో డెనీస్ డైరెక్ట్ చేశాడు. తాజా రిలీజ్ డేట్ ను మేకర్స్ రివీల్ చేశారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూవీస్ రిలీజ్ చేయడం ఏ మాత్రం బాలేదని, ‘బజూకా’ను సమ్మర్ కు రిలీజ్ చేస్తే బెటర్ గా ఉంటుందని నెటిజన్స్ సలహాలు ఇస్తున్నారు. అయితే… మమ్ముట్టీ, మోహన్ లాల్ వంటి అగ్ర కథానాయకుల సినిమాలు ఒకే ఏడాది పది పన్నెడు విడుదలైన సందర్భాలు అనేకం. కథలో దమ్ము ఉండాలి కానీ వెంటవెంటనే తమ చిత్రాలు ఎన్ని వచ్చినా ఫరక్ లేదంటారు వారు. మరి ‘డోమినిక్ అండ్ ద లేడీస్ పర్స్’, ‘బజూకా’ చిత్రాలకు ఎలాంటి ఆదరణ లభిస్తుందో చూడాలి.

