Shruti Haasan: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ఆకట్టుకుంటున్న శ్రుతి హాసన్, తాజాగా రజనీకాంత్ నటిస్తున్న ‘కూలీ’ సినిమాలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన శ్రుతి, తన కలల పాత్ర గురించి చెప్పుకొచ్చారు. సంగీతానికి సంబంధించిన ఓ పాత్రలో నటించాలని, ముఖ్యంగా సంగీత దర్శకురాలిగా స్క్రీన్‌పై కనిపించాలని తాను ఎప్పటినుంచో కలలు కంటున్నానని వెల్లడించారు. తన సినిమాలు బాక్సాఫీస్ వద్ద విజయం సాధిస్తుండటంతో శ్రుతి క్రేజ్ మరింత పెరిగింది. ఆమె కోరిక ఎప్పటికైనా నెరవేరుతుందా? అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
