Jasprit Bumrah: హెడింగ్లీలో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయిన భారత్..ఎడ్జ్‌బాస్టన్‌లో అద్భుతమైన విజయంతో ప్రతీకారం తీర్చుకుంది. జస్‌ప్రీత్ బుమ్రా లేకుండానే ఈ చారిత్రాత్మక విజయం సాధించడం విశేషం. దీని అర్థం భారత జట్టు ప్రధాన పేసర్ మైదానంలో లేకపోయినా, టీమిండియా 336 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించగలిగింది. బుమ్రా లేకుండా భారత్ గెలవడం ఇదే తొలిసారి కాదు. ముఖ్యంగా యార్కర్ స్పెషలిస్ట్ లేనప్పుడు టీమిండియా అద్భుతంగా ప్రదర్శన ఇస్తోంది. ఈ గణాంకాలే దీనికి నిదర్శనం.
జస్‌ప్రీత్ బుమ్రా ఇప్పటివరకు టీమిండియా తరఫున 46 టెస్ట్ మ్యాచ్‌లు ఆడాడు. ఈ సమయంలో భారత్ కేవలం 20 మ్యాచ్‌ల్లో మాత్రమే గెలిచింది. 5 మ్యాచ్‌లు డ్రా అయ్యాయి. భారత జట్టు మిగిలిన 22 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. అంటే జస్‌ప్రీత్ బుమ్రా ఆడిన 46 మ్యాచ్‌ల్లో టీమిండియా 22 మ్యాచ్‌ల్లో గెలవలేకపోయింది.
బుమ్రా టెస్ట్ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసినప్పటి నుండి.. భారత్ అతను లేకుండా 27 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఈ సమయంలో భారత జట్టు సరిగ్గా 19 మ్యాచ్‌ల్లో విజయం సాధించడం విశేషం. మిగిలిన 3 మ్యాచ్‌లు డ్రాగా ముగిశాయి. అంటే బుమ్రా లేకుండా టీమిండియా కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయింది.
ఇది కూడా చదవండి: Babar Azam: బాబర్ అజామ్‌కు పాక్ క్రికెట్ బోర్డు షాక్.. జట్టు నుంచి..
మొత్తం గణాంకాలను పరిశీలిస్తే.. జస్ప్రీత్ బుమ్రా లేనప్పుడు టీమిండియా ఎక్కువసార్లు గెలిచింది. బుమ్రా జట్టులో ఉన్నప్పుడు భారత జట్టు 43శాతం మ్యాచ్‌ల్లో గెలిస్తే.. లేనప్పుడు70శాతం మ్యాచ్‌ల్లో గెలిచింది. బుమ్రా ఇక్కడ టీమ్ లో లేకపోయినా పెద్ద ఇబ్బంది ఉండదని పలువురు అంటున్నారు.
దీనికి తాజా నిదర్శనం ఎడ్జ్‌బాస్టన్ టెస్ట్ మ్యాచ్ ఫలితం అని చెబుతున్నారు. అయితే, భారత బౌలింగ్ విభాగం మరింత బలోపేతం కావాలంటే, బుమ్రా అవసరం. కానీ నిజం ఏమిటంటే జస్ప్రీత్ మైదానంలోకి వచ్చినప్పుడు, మిగిలిన బౌలర్లు ఆశించిన విధంగా ప్రదర్శన ఇవ్వడం లేదు.
ఈ ఒక్క తప్పును టీమిండియా సరిదిద్దుకోగలిగితే.. టెస్ట్ క్రికెట్‌లో భారత జట్టు విజయాల సంఖ్యను పెంచుకోవచ్చు. ఈసారి లార్డ్స్‌లో భారత బౌలింగ్ విభాగానికి జస్‌ప్రీత్ బుమ్రా నాయకత్వం వహిస్తాడు. బుమ్రాతో పాటు మహ్మద్ సిరాజ్, ఆకాష్ దీప్ కూడా ఇంగ్లాండ్ భరతం పడతారు. 2021లో లార్డ్స్‌లో జరిగిన చివరి టెస్ట్ మ్యాచ్‌లో.. భారత్ 151 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించింది. ఆ గెలుపుతో సిరాజ్ కీలకం మారాడు. ఇప్పుడు సిరాజ్, ఆకాష్ దీప్ బుమ్రాతో కలిసి ఇంగ్లాండ్ పై దాడిని సాగిస్తారు. ఈసారి భారత జట్టు నుండి అద్భుతమైన విజయం ఆశించవచ్చు.
Also Read:
Vaibhav Suryavanshi: 29 సిక్సర్లు, 30 ఫోర్లు.. వైభవ్ ఆటకు గిల్ రికార్డు బద్దలు..
Avocado Side Effects: వీళ్లు.. అవకాడో అస్సలు తినకూడదు తెలుసా ?
Avoiding Sugar: 50 రోజులు చక్కెర తినడం మానేయండి.. శరీరంలో జరిగే అద్భుతమైన మార్పులు ఇవే..!