Health Tips: ప్రతి ఒక్కరి ఇంట్లో నెయ్యి ఉంటుంది. నెయ్యి లేకుండా తినలేమని చెప్పే వారు చాలా మంది ఉన్నారు. అయితే నెయ్యి తినేటప్పుడు చేసే కొన్ని తప్పులు ఆరోగ్య సమస్యలకు దారితీస్తాయని నిపుణులు అంటున్నారు. కొన్ని ఆహార పదార్థాలతో నెయ్యి తినడం వల్ల జీర్ణ సమస్యలతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఇప్పుడు మీరు ఏ ఆహారాలతో నెయ్యి తినకూడదో చూద్దాం.
నెయ్యి, తేనె కలిపి తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ పేరుకుపోతాయి. కాబట్టి తేనె, నెయ్యిని కలిపి తినకూడదు.
నెయ్యి, పెరుగు కలిపి తినకూడదు. ఇది మంచి కలయిక కాదు. ఇలా తినడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. నెయ్యిలోని కొవ్వు పెరుగులోని లాక్టిక్ ఆమ్లంతో కలిసి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.
ఇది కూడా చదవండి: Astro Tips: ఉదయం లేవగానే ఈ పనులు చేస్తున్నారా.? సమస్యలు తప్పవు సుమా..
ఈ రోజుల్లో నెయ్యి కలిపిన టీ తాగే వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఇలా చేయడం వల్ల నెయ్యిలోని కొవ్వులో కరిగే విటమిన్లతో అసమతుల్యత ఏర్పడుతుంది. దీనివల్ల జీర్ణ సమస్యలు వస్తాయి.
నెయ్యిని నీటిలో వేయొద్దు. వేడి నీళ్ళలో నెయ్యి కలిపి తాగడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇది ఫ్రీ రాడికల్స్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఫ్రీ రాడికల్స్ జీర్ణక్రియకు ఆటంకం కలిగిస్తాయి.
నెయ్యిని సుగంధ ద్రవ్యాలతో కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. ఇది గ్యాస్ట్రిక్ సమస్యలను కలిగిస్తుంది.
ఎలా తినాలి..
వేడి వేడి అన్నంలో నెయ్యి, ఉప్పు కలిపి తినడం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. పప్పు ధాన్యాలకు నెయ్యి జోడించడం వల్ల వాటి పోషక విలువలు పెరుగుతాయి. చపాతీని నెయ్యితో కలిపి తినడం కూడా ఆరోగ్యానికి మంచిది. నెయ్యిని ఎక్కువగా తింటే అది హానికరం. అతిగా తినడం వల్ల బరువు పెరగడంతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలు వస్తాయి.