DK Shivakumar: కుంభమేళాకు వెళ్లడంపై వచ్చిన ఆరోపణలపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు వెళ్తానని డీకే శివకుమార్ చెప్పగానే, ఆ రాష్ట్ర ప్రతిపక్ష నేత అశోక్ చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత బీజేపీకి దగ్గరవుతున్నారంటూ సోషల్ మీడియా, ప్రధాన మీడియాలో వస్తున్న ప్రచారంమైనా ఆయన స్పందించారు.
DK Shivakumar: కుంభమేళాకు వెళ్లి పవిత్ర స్నానం ఆచరించడం తన వ్యక్తిగత విషయమని డీకే శివకుమార్ తేల్చి చెప్పారు. తాను బీజేపీకి దగ్గరవుతున్నానని వస్తున్నవన్నీ పుకార్లన్నీ అబద్ధాలేనని స్పష్టం చేశారు. నేను పుట్టుకతోనే కాంగ్రెస్ వాదిని అని పేర్కొన్నారు. నా వ్యక్తిగత నమ్మకాలను నేను ఆచరిస్తానని చెప్పారు.
DK Shivakumar: హిందువుగా పుట్టానని, హిందువుగానే జీవిస్తానని, హిందువుగానే మరణిస్తానని ఓ దశలో తీవ్రస్థాయిలో స్పందించారు. కుంభమేళాకు వెళ్లినంత మాత్రాన బీజేపీకి దగ్గరవుతున్నానని చెప్తారా? అంటూ మీడియాపై మండిపడ్డారు. అలాంటి పుకార్లను ప్రజలు నమ్మబోరని చెప్పుకొచ్చారు. కొసమెరుపు ఏమిటంటే కుంభమేళాకు యూపీ ప్రభుత్వం మెరుగైన ఏర్పాట్లు చేసింది.. అని డీకే శివకుమార్ చెప్పడం గమనార్హం.