Dk shivakumar: సిద్ధరామయ్యతో సోదరునిల పని చేస్తా

DK shivakumar: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఇటీవల జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశంపై స్పష్టతనిచ్చిన ఉప ముఖ్యమంత్రి డీ.కే. శివకుమార్, ఆ భేటీ పూర్తిగా మీడియా ఒత్తిడి కారణంగానే జరిగిందని తెలిపారు. మీడియా ప్రతినిధులు వరుసగా ప్రశ్నలు వేస్తుండటంతోనే తాము కలిసి బ్రేక్‌ఫాస్ట్ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. సిద్ధరామయ్యను బ్రేక్‌ఫాస్ట్‌కు ఎప్పుడు ఆహ్వానిస్తారు అనే ప్రశ్నకు, అది తమ ఇద్దరి వ్యక్తిగత విషయం మాత్రమేనని శివకుమార్ తెలిపారు.

 

అధిష్ఠానం సూచనల మేరకు మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రిని బ్రేక్‌ఫాస్ట్ చర్చలకు ఆహ్వానించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు అవకాశంపై గత కొన్ని రోజులుగా రాజకీయ వర్గాల్లో చర్చలు సాగుతున్నాయి. సిద్ధరామయ్య స్థానంలో శివకుమార్‌కు అవకాశం కల్పించాలని ఉప ముఖ్యమంత్రి వర్గం భావిస్తోంది అనే కథనాలు మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో రెండు వర్గాలు ఉన్నాయనే వార్తలపై డీ.కే. శివకుమార్ స్పందించారు.

 

సిద్ధరామయ్యతో తాను సోదరుల్లా కలిసి ముందుకు సాగుతున్నామని శివకుమార్ స్పష్టం చేశారు. కర్ణాటక కాంగ్రెస్ పార్టీలో లేదా ప్రభుత్వంలో సిద్ధరామయ్య గ్రూప్, డీకే శివకుమార్ గ్రూప్ అని ఎలాంటి వర్గీకరణ లేదని ఆయన తెలిపారు. మీడియాలో మాత్రమే వర్గాలపై పుకార్లు, కథనాలు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

తాజాగా జరిగిన బ్రేక్‌ఫాస్ట్ సమావేశం కూడా మీడియా ఒత్తిడి కారణంగానే జరిగిందని మళ్లీ పేర్కొంటూ, ముఖ్యమంత్రి నివాసంలో పార్టీ సంబంధిత విషయాలపై మాత్రమే చర్చించుకున్నామని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియా అనవసరంగా పెద్దది చేయవద్దని శివకుమಾರ್ అన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *