Divvala Madhuri: బిగ్ బాస్ సీజన్ 9′ హౌస్ నుంచి ఈ వారం వైల్డ్ కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్ దువ్వాడ మాధురి ఎలిమినేట్ అయ్యారు. హౌస్‌లో ఉన్న కొద్ది రోజుల్లోనే గొడవలు, రాక్ రచ్చతో వార్తల్లో నిలిచిన మాధురి, బయటకు వచ్చిన తర్వాత కూడా తన ఘాటు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నారు.
‘నేను రావాలనుకున్నా కాబట్టే బయటకు వచ్చా’
మొదటి రెండు వారాలు నామినేషన్లలో లేని మాధురి, నామినేషన్లలో ఉండటంతోనే ఎలిమినేట్ అయ్యారు. అయితే, ఆమె తన ఎలిమినేషన్‌పై విభిన్నమైన వివరణ ఇచ్చారు.
“నేను కావాలనే బయటకు వచ్చేశా. నేను అనుకున్నాను కాబట్టే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశా… నన్ను ఎవరు బయటకు పంపలేదు. నేను వెళ్లాలనుకోని బిగ్ బాస్ కి వెళ్ళాను” అని ఆమె ధీమా వ్యక్తం చేశారు. హౌస్‌లో శ్రీజ, కళ్యాణ్, దివ్య, తనూజ, భరణి వంటి చాలా మంది కంటెస్టెంట్లతో నిత్యం గొడవలు పడుతూనే ఆట ఆడారు. ఆమె ప్రవర్తన కారణంగానే ఆడియన్స్ ఓటింగ్ తక్కువగా పడిందని తెలుస్తోంది.
భరణితో డాన్స్‌పై ట్రోలింగ్‌కు ఘాటు స్పందన
హౌస్‌లో భరణితో కలిసి చేసిన డాన్స్ గురించి వచ్చిన ట్రోలింగ్ మరియు మీమ్స్‌పై జర్నలిస్ట్ ప్రశ్నించగా, మాధురి తీవ్రంగా మండిపడ్డారు. “బుద్దిలేనోడు ఎవడో.. గడ్డితిన్న ఎదవ ఎవడో మీమ్స్ వెయ్యొచ్చు.. మీరు వెయ్యకుడదు.” అని జర్నలిస్ట్‌పై సీరియస్ అయ్యారు.
ఇది కూడా చదవండి: Rowdy Janardhan: రౌడీ జనార్దన్’ సినిమాలో ఆ సీనియర్ నటి.?
“మీరు ఎపిసోడ్ చూశారా? నాగార్జున డాన్స్ చేయమంటేనే నేను డాన్స్ చేశా. మేమేమి కావాలని డాన్స్ చేయలేదు.. ఒకరినొకరు హగ్ చేసుకోలేదు.. నా చేతివేలు కూడా భరణికి టచ్ అవలేదు. అందులో ఎలాంటి వల్గారిటీ లేదు.” అని స్పష్టం చేశారు. “ఎవడైతే ట్రోల్ చేశాడో వాడు అమ్మకు పుట్టివుండడు… వాడు ఎవడికి పుట్టాడో కూడా తెలియదు. అంత నీచాతి నీచంగా చేసిన వాడు నా దృష్టిలో మనిషే కాదు, పశువుతో సమానం” అంటూ ఆమె నోరు పారేసుకున్నారు.
వన్-రీతూ బంధంపై ప్రశ్న, మాధురి కౌంటర్
పవన్ మరియు రీతూ చౌదరి మధ్య ఉన్న ‘అన్‌హెల్దీ రిలేషన్’ గురించి మాధురి చేసిన కామెంట్స్‌పై జర్నలిస్ట్, దువ్వాడ శ్రీనివాస్‌తో ఆమె బంధం ‘హెల్దీ’గానే ఉందా అని ప్రశ్నించారు. ఆ ప్రశ్నకు మాధురి “మీకెందుకు మా గురించి” అని సీరియస్ అయ్యారు.రీతూ చౌదరి గురించి ఆమె ఇంట్లో వాళ్లే తనకు చెప్పారని, పవన్ తో దూరంగా ఉండమని చెప్పారని, అలాగే రీతూ తల్లి ఏడుస్తుందని కూడా చెప్పారని ఆమె చెప్పుకొచ్చారు. మాధురి చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు మరియు ఆగ్రహంతో కూడిన ఇంటర్వ్యూలు ప్రస్తుతం సోషల్ మీడియాలో మరియు యూట్యూబ్‌లో వైరల్గా మారాయి.
