Disha Patani

Disha Patani: ప్రభాస్ తో మరోసారి దిశా రొమాన్స్!

Disha Patani: రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాలు వరుసగా షూటింగ్ ఫ్లోర్‌పైకి వస్తూ ఫ్యాన్స్‌లో హైప్ పీక్స్‌కి తీసుకెళ్తున్నాయి. మారుతి ‘ది రాజా సాబ్’తో పాటు, హను రాఘవపూడి ‘ఫౌజీ’లో ప్రభాస్ నటిస్తున్న విషయం హాట్ టాపిక్‌గా మారింది. ‘ఫౌజీ’ని పీరియాడిక్ వార్ డ్రామాగా తీస్తుండగా, ప్రభాస్ క్యారెక్టర్ ఆడియన్స్‌ను షాక్‌కు గురిచేస్తుందని బజ్ నడుస్తోంది. ఇది ఒకవైపు ఉంటే, తాజాగా ‘ఫౌజీ’కి సంబంధించి ఓ సూపర్ అప్‌డేట్ సినీ సర్కిల్స్‌లో చర్చనీయాంశంగా నిలిచింది. ఈ చిత్రంలో బాలీవుడ్ హాటీ దిషా పటాని స్పెషల్ కేమియో రోల్‌లో కనిపించనుందని టాక్ వినిపిస్తోంది. హీరోయిన్‌గా ఇమాన్వి నటిస్తుండగా, మరో కీలక పాత్ర కోసం దిషాను టీమ్ లాక్ చేసినట్లు సమాచారం. గతంలో ‘కల్కి 2898 ఎడి’లో ప్రభాస్‌తో స్క్రీన్ షేర్ చేసిన దిషా, ఆ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకుంది. ఇప్పుడు మళ్లీ ప్రభాస్‌తో కలిసి ‘ఫౌజీ’లో సందడి చేయనుందనే న్యూస్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. అయితే, ఈ విషయంపై ఇంకా అఫీషియల్ క్లారిటీ రావాల్సి ఉంది. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ అప్‌డేట్‌తో ఫుల్ జోష్‌లో ఉండగా, షూటింగ్ ఫుల్ స్పీడ్‌లో జరుగుతోంది. ఈ కాంబో మరోసారి బాక్సాఫీస్ వద్ద రచ్చ చేయడం పక్కా అంటున్నారు సినీ పండితులు. మరి ఈ హాట్ అప్‌డేట్‌పై ఎప్పుడు కన్ఫర్మేషన్ వస్తుందో వేచి చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *