Trivikram Srinivas: అల్లు అర్జున్ పుట్టినరోజు సందర్భంగా ఆయన అభిమానుల్లో ఉత్సాహం పెరిగిపోతుంది. ఈ సందర్భంగా త్రివిక్రమ్ తో సినిమాని కన్ఫామ్ చేస్తూ చిత్ర యూనిట్ ఒక ఆకట్టుకునే పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్‌లో అల్లు అర్జున్ రెడ్ బ్యాక్‌డ్రాప్‌లో కూల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఆయనకు “హ్యాపీ బర్త్‌డే” అని శుభాకాంక్షలు తెలిపేలా ఈ పోస్టర్ రూపొందించబడింది. ఈ సినిమాని హరికా & హసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం గురించి ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ అభిమానులు ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తూ, ఆయనకు విషెశ్ తెలుపుతున్నారు.
