Gandhi Tatha Chettu: ప్రముఖ దర్శకుడు సుకుమార్, బబితా సుకుమార్ కుమార్తె సుకృతి వేణి ‘గాంధీతాత చెట్టు’ చిత్రంతో నటిగా పరిచయం అవుతోంది. పద్మావతి మల్లాది దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్, గోపీ టాకీస్ సంస్థలు దీనిని నిర్మించారు. ఇప్పటికే పలు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ చిత్రానికి చక్కని గుర్తింపు వచ్చింది. బెస్ట్ డెబ్యూ ఆర్టిస్ట్ గా సుకృతి వేణి అవార్డులు అందుకుంది.
తన తాతయ్య కు సంబంధించిన చెట్టును పరిరక్షించుకోవడానికి ఓ మనవరాలు గాంథేయ మార్గంలో ఎలాంటి పోరాటం చేసింది, అహింసాయుతంగా తన లక్ష్యాన్ని ఎలా చేరిందనేదే ఈ చిత్ర కథ. ఈ సినిమాను జనవరి 24న విడుదల చేయబోతున్నట్టు నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, శేష సింధూరావ్ తెలిపారు. బబిత సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించిన ఈ సినిమాలో ఆనంద్ చక్రపాణి, రఘురామ్, భాను ప్రకాశ్, నేహల్ ఆనంద్ కుంకుమ, రాగ్ మయూర్ ఇతర కీలక పాత్రలు పోషించారు.
ఈ వార్త కూడా చదవండి: ఐదు రోజుల్లో రూ. 50 కోట్లు వసూలు చేసిన మార్కో
Marco: ఉన్ని ముకుందన్ నటించిన ‘మార్కో’ సినిమా మలయాళ, హిందీ భాషల్లో సంచలన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తొలి ఐదు రోజుల్లే ఏకంగా రూ. 50 కోట్ల గ్రాస్ ను కలెక్ట్ చేసింది. దీంతో ఇతర భాషల్లోనూ ఈ మూవీని విడుదల చేసేందుకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగానే జనవరి 1న తెలుగులో దీనిని ఎన్.వి.ఆర్. సినిమా సంస్థ ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది.
Marco: ఇప్పటికే పలు తెలుగు సినిమాలలో నటించి చక్కని గుర్తింపు తెచ్చుకున్నారు ఉన్ని ముకుందన్. అతను నటించి వయొలెంట్ మూవీ ‘మార్కో’ను హనీఫ్ అదేని డైరెక్ట్ చేశారు. షరీఫ్ ముహమ్మద్ దీనిని నిర్మించారు. నాగ శౌర్య ‘రంగబలి’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన యుక్తి తరేజా కబీర్ దుహన్ ‘మార్కో’లో కీలక పాత్రలు పోషించారు. ‘కేజీఎఫ్’ ఫేమ్ రవి బస్రూర్ మ్యూజిక్ అందించారు. మరి మలయాళ చిత్రసీమలో ఘనవిజయాన్ని నమోదు చేసుకున్న ‘మార్కో’ని తెలుగువారు ఏ మేరకు ఆదరిస్తారో చూడాలి.
