Dhurandhar: రణవీర్ సింగ్ నటించిన బాలీవుడ్ చిత్రం ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధిస్తోంది. కొంతమంది విమర్శకులు పాకిస్తాన్ను విలన్గా చూపించారని ఆరోపించారు. దీంతో దర్శకుడు ఆదిత్య ధర్ సోషల్ మీడియాలో బలమైన కౌంటర్ ఇచ్చారు. ఈ విషయం గురించి పూర్తి వివరాలు చూద్దాం.
Also Read: Pragathi: పతకాలు పవర్ లిఫ్టింగ్వా? పూజలవా? వేణుస్వామి వ్యాఖ్యలపై నటి ప్రగతి ‘పవర్ ఫుల్’ కౌంటర్!
రణవీర్ సింగ్ హీరోగా నటించిన ధురంధర్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. విడుదలైన మొదటి వారంలోనే భారీ వసూళ్లతో పాటు ప్రముఖుల ప్రశంసలు అందుకుంది. అయితే కొంతమంది విమర్శకులు, సెక్యులర్ వాదులు ఈ చిత్రాన్ని ప్రచార చిత్రమని, పాకిస్తాన్ను విలన్గా చిత్రీకరించారని ఆరోపించారు. కల్పిత సన్నివేశాలతో ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నారని, వసూళ్లు కార్పొరేట్ బుకింగ్స్ వల్లే వచ్చాయని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు. ఈ ఆరోపణలపై దర్శకుడు ఆదిత్య ధర్ సోషల్ మీడియా ద్వారా బలమైన స్పందన తెలిపారు. విమర్శకులకు సూటి కౌంటర్ ఇచ్చారు. ఎన్ని విమర్శలు చేసినా, తన సినిమాని తొక్కలేరని ధీమా వ్యక్తం చేశారు. ఈ సినిమా మొదటి రోజు నుంచి బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ సృష్టిస్తోంది. ఈ ఏడాది బాలీవుడ్లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ఓటీటీ హక్కుల విషయంలోనూ రికార్డు స్థాయి ఒప్పందం కుదిరింది.
