Bajrangi Bhaijaan 2: సల్మాన్ ఖాన్ నటించిన బజరంగీ భాయ్‌జాన్ చిత్రం 2015లో విడుదలై బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమా అభిమానుల హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రూపొందించేందుకు దర్శకుడు కబీర్ ఖాన్, సల్మాన్ ఖాన్‌తో చర్చలు జరుపుతున్నారు. పింక్‌విల్లాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కబీర్ మాట్లాడుతూ, బజరంగీ భాయ్‌జాన్ 2 సాధారణ కథతో తీయబోమని స్పష్టం చేశారు.
Also Read: Kiara Advani: పండంటి ఆడబిడ్డకు జన్మించిన కియారా అద్వానీ!
ఈ సీక్వెల్ మొదటి భాగం యొక్క గొప్పతనానికి న్యాయం చేసేలా ఉండాలని, కేవలం బాక్సాఫీస్ లక్ష్యంతో కాకుండా, ప్రేక్షకులకు ఆనందాన్ని అందించే కథతోనే ముందుకు వెళ్తామని వెల్లడించారు. సల్మాన్ ఖాన్ కూడా ఈ విషయంలో కబీర్‌తో ఏకీభవిస్తున్నారు. రచయిత విజయేంద్ర ప్రసాద్ కథను సిద్ధం చేసే పనిలో ఉన్నారని తెలుస్తోంది. అభిమానులు ఈ సీక్వెల్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
