Harish Shankar: తెలుగు సినిమా రంగానికి చెందిన సాంకేతిక నిపుణులకు జాతీయ స్థాయిలో గుర్తింపు వస్తోంది. నేషనల్ అవార్డ్స్ ఎంపిక కమిటీలో తెలుగువారికి ఈ మధ్య కాలంలో చోటుదక్కుతోంది. అలానే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలోని వివిధ కేటగిరిల్లోనూ జ్యూరీల్లోనూ మనవాళ్ళను ఎంపిక చేస్తున్నారు. అలా ఈసారి నవంబర్ 20 నుండి 28 వరకూ గోవాలో జరుగబోతున్న ఫిల్మ్ ఫెస్టివల్ లో వెబ్ సీరిస్ జ్యూరీ మెంబర్ గా హరీశ్ శంకర్ ను ఎంపిక చేశారు. 2006లో ‘షాక్’ మూవీ కోసం మొదటిసారి మెగాఫోన్ చేతిలోకి తీసుకున్న హరీశ్ శంకర్ తెలుగులో కమర్షియల్ దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేస్తున్న హరీశ్ శంకర్ ఇటీవలే ‘మిస్టర్ బచ్చన్’ మూవీని తెరకెక్కించాడు.

