Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న “మన శంకర వరప్రసాద్ గారు”లో విక్టరీ వెంకటేష్ ఎక్స్‌టెండెడ్ క్యామియో చేస్తున్నారు. ఈ పాత్ర గురించి దర్శకుడు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఈ సినిమా విశేషాలు ఇప్పుడు చూద్దాం.
Also Read: Kaantha: కాంత ఓటీటీ రాక ఖరారు..?
చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పూర్తి కామెడీ ఎంటర్‌టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు”. ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ ఎక్స్‌టెండెడ్ క్యామియోలో కనిపించబోతున్నారు. ఇటీవల ఆయన ఓ పాట షూటింగ్‌ను కూడా పూర్తి చేశారు. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి.. “వెంకటేష్ గారి పాత్ర చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సుమారు 20 నిమిషాల పాటు కనిపిస్తారు. ముఖ్యంగా చిరంజీవి-వెంకటేష్ కలిసి నటించిన క్లైమాక్స్ సన్నివేశాలు అభిమానులను ఎంతగానో అలరిస్తాయి” అని చెప్పారు. మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ సినిమా పూర్తి వినోదాత్మకంగా ఉంటుందని, అభిమానులకు ఖచ్చితంగా నచ్చుతుందని ధీమా వ్యక్తం చేశారు. సాహు గారపాటి, సుస్మిత సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

