Dilsukhnagar Bomb Blast Case: 12 ఏండ్ల క్రితం హైదరాబాద్ నగరంలోని దిల్‌సుఖ్‌నగర్‌లో జరిగిన బాంబు దాడి ఘటనపై ఈ రోజు (ఏప్రిల్ 8)న హైకోర్టు కీలక తీర్పు ఇవ్వనున్నది. 2013 ఫిబ్రవరి 2వ తేదీన రెండుసార్లు వరుసగా ఉగ్రదాడులు జరిగాయి. ఈ దాడుల్లో మొత్తం 18 మంది మృతిచెందగా, 131 మంది గాయాలపాలయ్యారు. ఈ ఉగ్రదాడితో హైదరాబాద్ సహా దేశవ్యాప్తంగా ప్రజలు ఉలిక్కిపడ్డారు.
Dilsukhnagar Bomb Blast Case: ఈ దాడి ఘటనపై విచారించిన ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016లోనే ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష విధించగా, ఆ తీర్పుపై నిందితులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరుపుతున్న హైకోర్టు మంగళవారం తీర్పును వెలువరించనున్నది. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాద సంస్థ టిఫిన్ బాక్సుల్లో బాంబు పెట్టి ఈ పేలుళ్లకు పాల్పడింది.
ఆ రోజు ఏం జరిగింది?
Dilsukhnagar Bomb Blast Case: 2013 ఫిబ్రవరి 2వ తేదీ రాత్రి 7 గంటల సమయంలో దిల్‌సుఖ్‌నగర్‌లోని సిటీ 107వ నంబర్ బస్టాప్ వద్ద మొదటి మొదటి బాంబు పేలుడు సంభవించింది. ఆ తర్వాత కొద్ది క్షణాలకే సమీపంలోనే ఉన్న కోణార్క్ సినిమా థియేటర్ ఎదుట ఓ మిర్చి సెంటర్ వద్ద రెండో బాంబు పేలుడు సంభవించింది. రెండు చోట్ల జరిగిన పేలుళ్ల ధాటికి మొత్తం 18 మంది మృతి చెందగా, 131 మంది గాయాలపాలయ్యారు. గాయాలపాలైన వారిలో మహిళకు, ఆమె గర్భంలో ఉన్న శిశువుకూ గాయాలయ్యాయి. ఈ రెండు ఘటనలపై సరూర్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పరారీలోనే ప్రధాన నిందితుడు
Dilsukhnagar Bomb Blast Case: దేశవ్యాప్తంగా ప్రజలను ఉలికిపాటుకు గురిచేసిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు పేలుళ్ల కేసుపై 12 ఏండ్ల తర్వాత హైకోర్టు తుది తీర్పును వెలువరించనున్నది. ఈ కేసులో ఇప్పటివరకు 157 మంది సాక్షులను కోర్టు విచారించింది. అయితే ఈ కేసులో ప్రధాన నిందితుడైన, ఇండియన్ ముజాహిదీన్ సహ వ్యవస్థాపకుడు యాసిన్ భత్కల్ ఇప్పిటికీ పరారీలో ఉండటం గమనార్హం. ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు 2016లో ఇచ్చినట్టుగా ఉరిశిక్షను విధిస్తుందా? యావజ్జీవ శిక్షతో సరిపెడుతుందా? ఈ రోజు తేలనున్నది.