Dil Raju: కిరణ్ అబ్బవరం తాజా చిత్రం ‘క’ దీపావళికి విడుదలై సెన్షేషనల్ హిట్ అయింది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో దిల్ రాజు మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం హార్డ్ వర్క్, టాలెంట్ కి దక్కిన ప్రతిఫలం ఈ ‘క’ విజయం అన్నారు. దీపావళికి భారీ పోటీ ఉన్నప్పటికీ అన్ని సినిమాలు విజయం సాధించం, ఆ పోటీని తట్టుకుని నిలబడి ఘన విజయం అందుకోవడం మామూలు విషయం కాదన్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టంతో, ప్రతిభతో నిలదొక్కుకున్న కిరణ్ మరిన్ని విజయాలను సాధించాలని కోరుకుంటున్నానన్నారు దిల్ రాజు. ఎన్నో కథలు వింటుంటానని, వాటిలో తదుపరి ఏం జరుగుతుందో ఊహించగలనని, అయితే ‘క’ సినిమా క్లయిమాక్స్ మాత్రం గెస్ చేయలేక పోయానన్నారు బన్నీ వాస్. వంశీ నందిపాటి రిస్క్ చేస్తున్నాడేమో అనిపించి భయపడ్డా సినిమా చూశాక తన నిర్ణయం కరెక్టే అనిపించిందన్నారు బన్నీ వాసు. ఈ సక్సెస్ మీట్ లో వశిష్ట తో పాటు పంపిణీదారుడు వంశీ నందిపాటి, యూనిట్ సభ్యులు కూడా పాల్గొని తమ సినిమా విజయం పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు.
