Dil Raju: తమ్ముడు కొడుకు ఆశిష్ ను టాలీవుడ్ స్టార్ హీరోగా నిలిపేందుకు చాలా కష్టపడుతున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈ హీరో నటించిన రౌడీబాయ్స్ అంతగా ఆకట్టుకోలేదు, లవ్ మీ కూడా ఫ్లాప్ గా మిగిలింది. సెల్ఫిష్ అనే మరో సినిమా స్టార్ట్ చేసి అవుట్ ఫుట్ సరిగా లేదని అలా పక్కన పెట్టేసాడు దిల్ రాజు. దీంతో ఆశిష్ బాబు పరిస్థితి గందరగోళంగా మారింది. అందుకే ఈ నేపధ్యంలో ఆశీష్ కు ఎలాగైనా హిట్ ఇవ్వాలని దిల్ రాజు కంకణం కట్టుకున్నాడు. అందుకోసం కమర్షియల్ ఎంటర్టైనర్ సినిమాలతో ఆకట్టుకున్న త్రినాధ రావుకు ఆ భాద్యతలు అప్పగించారు దిల్ రాజు. అయితే నక్కిన త్రినాధ రావు సినిమా అంటే బెజవాడ ప్రసన్న కథ అందించాల్సిందే. కానీ ఈ సినిమాకు మాత్రం బెజవాడ ప్రసన్నను పక్కన పెట్టేసారు. ఆశిష్ చేసే సినిమాకు స్టార్ దర్శకుడు హరీష్ శంకర్ కథ అందిస్తున్నాడు. మరి హరీష్ కథతో ఆశిష్ కు త్రినాథ రావు హిట్ అందిస్తాడో లేదో చూడాలి.
