Digvijay Singh: రాజ్యసభకు పోటీ చేస్తలేను

Digvijay Singh:మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మరియు సీనియర్ కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను మూడోసారి రాజ్యసభకు పోటీ చేయబోమని ప్రకటించారు.

దిగ్విజయ్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ఈ ఏడాది ఏప్రిల్ 2026తో ముగియనుంది. పదవీకాలం ముగిసిన తర్వాత మరోసారి ఎన్నికల రేసులో ఉండకూడదని ఆయన నిర్ణయించారు.

రాజ్యసభ సీటు పార్టీకి చెందినదని, తాను సీటును ఖాళీ చేస్తున్నానని దిగ్విజయ్ సింగ్ తెలిపారు. అయితే, ఆ సీటు ఎవరికి ఇవ్వాలనేది హైకమాండ్ నిర్ణయమని ఆయన చెప్పారు.

ఈ నిర్ణయానికి ముఖ్య కారణంగా మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎస్సీ విభాగం అధ్యక్షుడు ప్రదీప్ అహిర్‌వార్ విజ్ఞప్తి నిలిచింది. దళిత వర్గానికి చెందిన నాయకుడికి రాజ్యసభ అవకాశం ఇవ్వాలని ఆయన పార్టీ నాయకత్వానికి లేఖ రాశారు.

ప్రదీప్ అహిర్‌వార్ లేఖలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో 17% ఎస్సీ జనాభా ఉన్నందున సామాజిక న్యాయం కోసం దళిత నాయకుడిని రాజ్యసభకు పంపాలని కోరారు.

దిగ్విజయ్ సింగ్ 2014 నుంచి రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అంతకుముందు 1993–2003 వరకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *