ka movie: ‘లక్కీభాస్కర్’తో చెప్పి మరీ హిట్ కొట్టాడు సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత నాగవంశీ. ఈ ఏడాది సంక్రాంతికి మహేశ్ బాబు, త్రివిక్రమ్ తో ‘గుంటూరు కారం’ రిలీజ్ చేసిన నాగవంశీ దీపావళికి ‘లక్కీభాస్కర్’ రిలీజ్ చేశాడు. అయితే ఈ రెండు సందర్భాల్లోనూ వీటికి పోటీ ఎదురైంది. సంక్రాతికి ‘హనుమాన్’ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. దీపావళకి ‘క’ సినిమాతో పాటు ‘అమరన్’ రిలీజ్ అయి విజయం సాధించాయి. అటు సంక్రాతికి ‘హనుమాన్’ కు కానీ, ఇటు దీపావళికి ‘క’ సినిమాకు గానీ సెంటిమెంట్ వర్కవుట్ అయిందని ఓ సందర్భంలో నాగవంశీ చెప్పాడు. అంతే కాదు వచ్చే సంక్రాంతికి మా సినిమాకి మేము సింపతీ ప్లే చేయాలేమో అని వ్యంగ్యంగా కూడా మాట్లాడాడు.
ka movie: దీంతో నాగవంశీ ‘హనుమాన్’, ‘క’ సినిమాలను తక్కువ చేసి మాట్లాడినట్లయింది. సినిమాలో విషయం లేకపోతే ఎంత సింపతీ ఉన్నా ఆడవన్న సంగతి నాగవంశీకి బాగానే తెలుసు. అయినా అవి పోటీలో లేకుంటే తమ సినిమాకు అడ్వాంటేజ్ ఉండేదన్న భావం బయట పడింది. ఏది ఏమైనా పోటీలో గెలిచి నిలిచిన వాడే అసలైన విజేత. అలా అసలు సిసలు విజేతగా నిలవాలే కానీ మేము కూడా సింపతీ ప్లే చేయాలేమో అని నాగవంశీ అనటం సరికాదేమో అని కొందరి భావన. మరి వచ్చే ఏడాది సంక్రాంతికి తమ సినిమాకు వేరే ఎవనైనా పోటీకి వస్తే నాగవంశీ ఏమంటాడో చూడాలి.