Dhulipalla Narendra Kumar: తెనాలిలో జరిగిన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పర్యటన తీవ్ర రాజకీయ దుమారం రేపుతోంది. ఈ సందర్భంగా పోలీసు వాహనం మీద ఎక్కి చేసిన ప్రవర్తనపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ధూళిపాళ్ల నరేంద్ర తీవ్రంగా స్పందించారు. సైకో తరహా వ్యక్తులకు జగన్ మద్దతు ఇవ్వడాన్ని ఆయన తీవ్రంగా విమర్శించారు.
“జగన్ మరోసారి అశాంతికి బీజం వేస్తున్నారు. తెనాలిలో పోలీసు వాహనంపై ఎక్కి హల్‌చల్ చేసిన వ్యక్తులు సైకోలా ప్రవర్తించారు. అలాంటి వారిని పరామర్శించడానికి వెళ్లడమే జగన్ 2.0 నిజ స్వరూపం,” అంటూ ధూళిపాళ్ల మండిపడ్డారు. అలాంటి అసహ్యపు ప్రవర్తనను ప్రోత్సహించడానికి జగన్‌కు సిగ్గుండాలని వ్యాఖ్యానించారు. ప్రజలు తేల్చి చెప్పినా జగన్ వైఖరిలో మార్పు రావడం లేదని ధూళిపాళ్ల అభిప్రాయం. ప్రజాస్వామ్యంలో ఈ తరహా వ్యక్తులకు తిరిగే నైతిక హక్కే లేదన్నారు.
Also Read: VasamShetty subash: జగన్ కు దమ్ముంటే లోకేష్‌తో డిబేట్‌కు రావాలి
Dhulipalla Narendra Kumar: జగన్ “జగన్ 2.0” చూపిస్తానంటూ ప్రజలను భయపెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, గతంలో జరిగిన అరాచకాలను మళ్లీ మొదలుపెట్టే ప్రయత్నమే ఇది అని ఆరోపించారు. ఇది ఒక భయానక ప్రవృత్తికి సంకేతమని పేర్కొన్నారు.
తెనాలిలో పోలీసు వాహనం మీద ఎక్కి విధ్వంసకరంగా ప్రవర్తించిన వారిపై ప్రభుత్వం తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. శాంతి భద్రతల కోసం ప్రభుత్వం సీరియస్‌గా వ్యవహరించాలని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో రాష్ట్ర రాజకీయాలు మరింత వేడెక్కాయి.