Dhruva Thota

Dhruva Thota: ర్యాపిడ్ చెస్ విజేత ధ్రవ

Dhruva Thota: వారస్ చెస్ అకాడమీ నిర్వహించిన ఫిడె వన్డే ర్యాపిడ్ చెస్ టోర్నీలో ధ్రువ తోట విజేతగా నిలిచాడు. హైదరాబాద్లోని జిపి బిర్లా సెంటర్లో నిర్వహించిన ఈ టోర్నీకి మంచి ఆదరణ లభించింది. ఫిడె గుర్తింపు ఉన్న టోర్నీ కావడంతో దాదాపు 500 మంది ప్లేయర్లు పాల్గొన్నారు.

ఉదయం 9 తర్వాత ఓపెనింగ్ సెరిమనీతో మొదలైన ఈ టోర్నీలో ప్లేయర్లందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. వాల్డ్ చెస్ ఫెడరేషన్, ఆలిండియా చెస్ ఫెడరేషన్, తెలంగాణ స్టేట్ చెస్ అసోసియేషన్ గుర్తింపుతో నిర్వహిస్తున్న ఈ టోర్నీ ఇంటర్నేషనల్ మాస్టర్ రాఘవ్ శ్రీవాత్సవ్ ఆధ్వర్యంలో జరిగింది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన చెస్ ప్లేయర్లు ఈ టోర్నీలో పాల్గొన్నారు.

టోర్నీలో 9 రౌండ్లకు గాను 8.5 పాయింట్లు సాధించిన ధ్రువ్ తోట విజేతగా నిలిచాడు. 8 పాయింట్లతో ప్రణయ్ ఆకుల, కౌత్సువ్ కుందు 2, 3వ స్థానాల్లో నిలిచారు. ఏజ్ కేటగిరీల్లో అండర్-15 బాలికలు, బాలుర విభాగాల్లో సహజ్దీప్ కౌర్, ఇమాన్ షేక్ విజేతలుగా నిలిచారు. అండర్-13 విభాగంలో తనిష్ రాఘవన్, శరణ్యదేవి..అండర్-11 విభాగంలో గౌరవ్ కార్తికేయ, సంహిత…అండర్-9 కేటగిరీలో ఆద్విక్ అభినవ్ కృష్ణ, అంకిత్ రాజ్… అండర్ – 7 విభాగంలో సిద్ధార్థ్, శివాత్మిక శిఖ విజేతలుగా నిలిచారు.

టోర్నీ అనంతరం విజేతలకు ప్రైజ్ మనీ అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఐపీఎస్ అధికారి రాజశేఖర్, ఎబీఐ రిటైర్డ్ ఏజీఎం అశోక్ హాజరయ్యారు. వారి చేతుల మీదుగా ట్రోఫీలు, 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్ అందించారు. వివిధ విభాగాల్లో విజేలతో పాటు 98 మందికి క్యాష్ ప్రైజ్ అందించడం విశేషం.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  IND vs ENG: ఓవల్‌లో టీమిండియా చారిత్రాత్మక విజయం: ఇంగ్లండ్‌పై గెలిచి సిరీస్ సమం!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *