Dhoom Dhaam: చేతన్ కృష్ణ, హెబ్బా పటేట్ జంటగా రూపొందుతున్న చిత్రం ‘ధూం ధాం’. ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ పతాకంపై ఎ.ఎస్ రామ్ కుమార్ ఈ సినిమాను సాయికిశోర్ మచ్చ దర్శకత్వంలో రూపొందితున్నారు. పూర్తి స్థాయి ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో వెన్నెల కిశోర్, సాయి కుమార్, పృధ్వీరాజ్, గోపరాజు రమణ ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఇక ఈ సినిమా నుంచి విడుదల చేసిన ‘మల్లెపూల టాక్సీ… మాయా సుందరి… టమోటో బుగ్గల పిల్ల…. కుందనాల బొమ్మ… ‘ పాటలకు చక్కటి స్పందన లభించటంతో మంచి బజ్ ఏర్పడింది. ఇప్పడు టీజర్ ను విడుదల చేసింది యూనిట్. మారుతి చేతుల మీదుగా విడుదలైన ఈ టీజర్ ఎంటర్ టైనింగ్ గా ఉండి సినిమాపై అంచనాలను పెంచిందని నిర్మాత చెబుతున్నారు. ఈ సినిమాను నవంబర్ 8న విడుదల చేయబోతున్నట్లు తెలిపారాయన. గోపీసుందర్ పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోరుతో కూడా ఆకట్టుకుంటారని, లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా ఆకట్టుకోవడం ఖాయమంటున్నాడు దర్శకుడు సాయికిశోర్. మరి ఈ ‘ధూం ధాం’ ఆడియన్స్ ను ‘ధూం ధాం’గా అలరిస్తుందేమో చూద్దాం.

