Dhoom Dhaam : నవంబర్ 08న థియేటర్ లో ధూం ధాం

చేతన్ కృష్ణ, హెబ్బాపటేల్ హీరోహీరోయిన్లుగా రూపుదిద్దుకున్న సినిమా ధూంధాం. సాయికిషోర్ మచ్చా దర్శకత్వం వహించిన ఈ వినోదాత్మక సినిమాను మైత్రి మూవీ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పి వారు రిలీజ్ చేస్తుండడం విశేషం. వచ్చే నెల 8న థియేటర్లలో వినోదాన్ని పంచేందుకు వస్తోందని కటించారు మేకర్స్. . ఈ నేపథ్యంలో స్టార్ డైరెక్టర్ మారుతి ధూం ధాం సినిమా టీజర్ రిలీజ్ చేశారు. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో టీజర్ చాలా బాగుందని చెప్పిన మారుతి, మూవీ టీమ్ కు తన బెస్ట్ విశెస్ అందించారు.

ప్రముఖ నటులు సాయి కుమార్, వెన్నెల కిషోర్, పృథ్వీరాజ్, గోపరాజు రమణ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించిన ఈ కలర్ఫుల్ చిత్రం మేకర్స్ సాలిడ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఇది వరకే రిలీజ్ కి రావాల్సి ఉండగా వాయిదా వేశారు. ఈ పండుగ లాంటి ఎంటర్టైనర్ నవంబర్ మొదలవుతుంది. ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించగా ఫ్రైడే ఫ్రేమ్ వర్క్స్ వారు నిర్మాణం వహించారు.

హీరో హీరోయిన్లు చేతన్ కృష్ణ, హెబ్బా పటేల్ లవ్ స్టోరీతో “ధూం ధాం” సినిమా టీజర్ ప్రారంభమైంది. ఈ లవ్ స్టోరీతో పాటు తండ్రీ కొడుకుల మధ్య ఎమోషనల్ బాండింగ్ ఈ సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ తో తెలుస్తోంది. చేతన్ కృష్ణ చేసిన విలేజ్ యాక్షన్ సీక్వెన్స్ ఆకట్టుకుంటోంది. వెన్నెల కిషోర్ పెళ్లి సందడిలో డిజైన్ చేసిన కామెడీ ట్రాక్ ఎంటర్ టైనింగ్ గా ఉంది. లవ్, ఫ్యామిలీ, ఎమోషన్, యాక్షన్, కామెడీ..ఇలా థియేటర్ లో ప్రేక్షకుడు చూసి ఎంజాయ్ చేసే అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో “ధూం ధాం” టీజర్ ఇంప్రెస్ చేస్తోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Prithvi Raj: 18 వందల కాల్స్.. సైబర్ క్రైమ్ లో పృథ్వి రాజ్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *