Dhoom 4

Dhoom 4: ధూమ్ 4 రచ్చ: రణ్‌బీర్‌తో అయాన్ మాస్ షో?

Dhoom 4: బాలీవుడ్‌లో ఐకానిక్ ఫ్రాంచైజ్‌గా నిలిచిన ధూమ్ సిరీస్ మళ్లీ స్పీడ్ పెంచబోతోంది! ధూమ్ 4 కోసం యష్ రాజ్ ఫిల్మ్స్ గ్రాండ్ ప్లాన్‌తో ముందుకొస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌కు డైరెక్టర్ అయాన్ ముఖర్జీ రెడీ అవుతున్నారు. ప్రస్తుతం వార్ 2తో బిజీగా ఉన్న అయాన్, బ్రహ్మాస్త్ర 2ను పక్కనపెట్టి ధూమ్ 4ను తెరపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్ లీడ్ రోల్‌లో మెరవనున్నారు. యానిమల్ సినిమాతో క్రేజ్ పీక్స్‌లో ఉన్న రణ్‌బీర్, కథ వినకుండానే అయాన్‌పై నమ్మకంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట! 2026 ఏప్రిల్‌లో షూటింగ్ షురూ కానుంది. అయితే, వార్ 2 టీజర్‌పై వచ్చిన కొన్ని విమర్శల నేపథ్యంలో అయాన్ ఈ సినిమాతో తన సత్తా చాటాల్సి ఉంది. రణ్‌బీర్‌తో ధూమ్ 4 అనౌన్స్‌మెంట్ ఒక్కటే అభిమానుల్లో హైప్ పెంచేస్తోంది. ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్‌ను షేక్ చేయడం పక్కా!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *