IPL 2025: ఐపీఎల్ 2025 కోసం చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్, స్టార్ ప్లేయర్ ధోనీ ప్రాక్టీస్ ప్రారంభించినట్లు తెలిసింది. ఈ సీజన్ కోసం అతను కొత్త బ్యాట్‌తో బరిలోకి దిగబోతున్నాడని సమాచారం వచ్చింది. అంతేకాకుండా, ఈ సీజన్ కోసం సీఎస్కే నిర్వహించనున్న ప్రీ-ఐపీఎల్ క్యాంప్‌కు కూడా హాజరు కానున్నాడని కొన్ని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఆ కథాకమామీషు విషయానికి వస్తే…
ఈ సీజన్‌లో ధోనీ అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడనున్నాడని అందరికీ తెలిసిందే. ధోనీని జట్టులో తక్కువ ధరకు ఉంచుకోవాలి పైగా క్యాప్డ్ లేయర్ గా కూడా అతడు బరిలో ఉండాలి అని ఐపీఎల్ సమాఖ్య రూల్స్ మార్చింది అని కూడా అప్పట్లో వచ్చిన అభియోగాలు తెలిసిందే.
IPL 2025: అయితే తాజా ఈ సీజన్ లో ధోనీ వాడే బ్యాట్ బరువు 1250 నుండి 1300 గ్రాముల మధ్య ఉంటుంది. గతంలో కూడా అతను అత్యంత బరువైన బ్యాట్‌లను వాడేవాడు. కానీ ఈసారి బ్యాట్ బరువును కనీసం 10-20 గ్రాములు తగ్గించుకున్నాడని కొన్ని క్రికెట్ వర్గాలు తెలిపాయి. బ్యాట్ బరువు 1230 గ్రాములు ఉండేలా తయారు చేయించుకున్నాడట.
ఇటీవలే మీరఠ్‌కు చెందిన సాన్స్ పరీల్స్ గ్రీన్ ల్యాండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ధోనీకి నాలుగు బ్యాట్లను డెలివరీ చేసింది. ప్రతి బ్యాట్ బరువు దాదాపు 1230 గ్రాములు ఉంటుంది. గతంలో ధోనీ వాడిన బ్యాట్ మోడల్‌లాగే వీటిని తయారు చేశారు అని ఒక ప్రతినిధి తెలిపారు.
IPL 2025: అయితే సీఎస్కే ట్రైనింగ్ షెడ్యూల్ ఇంకా ఫైనలైజ్ కాలేదు. చిదంబరం స్టేడియం మార్చి 9 వరకు ట్రైనింగ్ కోసం ఉపయోగించకూడదని నిర్ణయించారు. ఎందుకంటే ఈ స్టేడియంను ఆప్టిమల్ కండిషన్‌లో ఉంచేందుకు బీసీసీఐ కఠినమైన సూచనలు ఇచ్చింది అని తెలుస్తోంది. ఇక ధోనీ ప్రాక్టీస్ చేసే సమయంలో మైదానం ప్రేక్షకులతో కిక్కిరిసిపోతుంది.
ప్రస్తుతం ధోనీ రాంచీలో ప్రాక్టీస్ చేస్తున్నాడని తెలిసింది. తన స్కిల్స్‌ను మరింత పదునుగా చేసుకోవడానికి బౌలింగ్ మెషీన్‌తో సాధన చేస్తున్నాడట. ఈ విషయాన్ని ఝార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్‌కు చెందిన ఒక అధికారి తెలిపారు. గతంలో ఇక్కడే ధోనీ టెన్నిస్ బంతితో కూడా మ్యాచ్ ఆడాడని సదరు అధికారి వెల్లడించారు.