Dharmapuri aravind: బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ పై ఫైర్ అయ్యారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్.కేటీఆర్ పై విచారణకు ప్రభుత్వం గవర్నర్ అనుమతి కోరడం హస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి, మంత్రి కాదని.. ఓ సాధారణ ఎమ్మెల్యే అని అందుకు గవర్నర్ అనుమతి అక్కర్లేదని కామెంట్ చేశారు. లగచర్ల లో కలెక్టర్‌పై దాడి కల్వకుంట్ల కుటుంబం చేయించిన పనేనని అన్నారు.
కేటీఆర్ ది మేకపోతు గాంభీర్యమని.. అరెస్ట్ చేసి జైల్లో పడేయాలన్నారు.యోగీ అదిత్యనాథ్ బుల్డోజర్‌కు.. రేవంత్‌రెడ్డి బుల్డోజర్‌కు చాలా తేడా ఉందని అన్నారు. కావాలనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ ను పూర్తిగా దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. సబర్మతి నది ప్రక్షాళణ సమయంలో గుజరాత్ ప్రభుత్వం నిరుపేదలకు ప్రత్యామ్నాయంగా ఇళ్లను నిర్మించి వారిని అక్కడికి తరలించాకే నది ప్రక్షాళన మొదలు పెట్టారని గుర్తు చేశారు. టీబీజేపీ అధ్యక్ష రేసులో తాను కూడా ఉన్నానని ధర్మపురి అర్వింద్ అన్నారు.
మూసీ ప్రక్షాళన పేరుతో ప్రభుత్వం నిరుపేదల ఇళ్లను నిర్ధాక్షిణ్యంగా కూల్చివేస్తోందని.. అదే పాతబస్తీకి వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి ఒక్క బిల్డింగ్‌ను అయినా కూల్చే దమ్ముందా అని ఎంపీ ధర్మపురి అర్వింద్ సవాల్ విసిరారు.