D56: అనే హ్యాష్‌ట్యాగ్‌తో ఈ చిత్రం ఇప్పటికే సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ నిర్మించనుంది. మారి సెల్వరాజ్ గత చిత్రాలు ‘పరియరుమ్ పెరుమల్’, ‘కర్ణన్’ వంటి హిట్స్‌తో తనదైన ముద్ర వేశారు. ఇప్పుడు ధనుష్‌తో కలిసి ఆయన తెరకెక్కించనున్న ఈ చిత్రం ఒక థ్రిల్లింగ్ హిస్టారికల్ ఎపిక్‌గా రూపొందనుంది.
Also Read: Janhvi Kapoor : కోలీవుడ్ పై కన్నేసిన జాన్వీ బ్యూటీ!
D56: ఈ సినిమా గురించి అధికారిక ప్రకటన వచ్చిన వెంటనే అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ధనుష్‌కు చారిత్రక నేపథ్యం ఉన్న కథల్లో నటించడం కొత్తేమీ కాదు, కానీ మారి సెల్వరాజ్ మార్క్ డైరెక్షన్‌తో ఈ చిత్రం మరో మైలురాయి అవుతుందని అంతా ఆశిస్తున్నారు. కొలివుడ్‌లో ఈ కాంబో గురించి ఇప్పటికే చర్చలు షురూ అయ్యాయి. ఈ హిస్టారికల్ డ్రామా ఎలాంటి సందేశాన్ని అందిస్తుంది? ధనుష్ లుక్ ఎలా ఉంటుంది? అనే ఆసక్తి అందరిలో నెలకొంది.