Dhanush: తమిళ సినీ హీరో ధనుష్ నటిస్తున్న సినిమా సెట్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఆయన నటిస్తున్న ఇడ్ల కడై సినిమా కోసం వేసిన భారీ సెట్ ఈ అగ్నిప్రమాదంలో దహనమైంది. ఇదే ప్రమాదంలో సినిమాకు సంబంధించిన కీలక సామగ్రి కూడా దగ్ధమైనట్టు సమాచారం.
Dhanush: హీరో ధనుష్ నటిస్తున్న ఇడ్లీ కడై సినిమా నిర్మాణం కోసం తమిళనాడు రాష్ట్రంలోని తేని జిల్లాలోని అండిపట్టిలో నిర్మాతలు భారీ సెట్ వేశారు. ప్రమాదవశాత్తు ఆ సెట్‌కు నిప్పంటుకున్నది. ఆ మంటలు చెలరేగి భారీ సెట్ మొత్తం కాలిబూడిదైంది. స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలను చల్లార్చే పనిలో పడ్డారు.
Dhanush: హీరో ధనుష్ ఇడ్లీ కడై సినిమాతోపాటు తమిళ, తెలుగు, హిందీతో కలిసి సుమారు 12 సినిమాల్లో నటిస్తున్నాడు. ఆయన తెలుగులో నటించిన ఎన్నో సినిమాలు విజయవంతంగా నడిచాయి. ఆయనకు తమిళనాడుతోపాటు తెలుగు రాష్ట్రాల్లోనూ అభిమానులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇటీవల పాన్ ఇండియా సినిమాలతో ఆయన దూసుకుపోతున్నారు.
