Idli Kadai First Look Poster

Idli Kadai First Look Poster: డిఫరెంట్ గెటప్ తో.. ధనుష్ ఇడ్లీ కడై ఫస్ట్ లుక్ పోస్టర్

Idli Kadai First Look Poster: ధనుష్ దర్శకత్వం వహిస్తున్న నాలుగో చిత్రం ‘ఇడ్లీ కడై’. గతంలో ధనుష్ ‘పా పాండి, రాయన్’ చిత్రాలను రూపొందించాడు. ఇక ‘నీలవుక్కు ఎన్ మేల్ ఎన్నాడి కుంబమ్’ మూవీ విడుదల కావాల్సి ఉంది. ఈ లోగా నాలుగో సినిమా ‘ఇడ్లీ కడై’ను రూపొందించే పనిలో పడ్డాడు ధనుష్. ఈ జాతీయ ఉత్తమ నటుడితో జాతీయ ఉత్తమ నటి నిత్యా మీనన్ జత కలిసింది. రాజ్ కిరణ్‌, సముతిర కని ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాశ్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాను ఆకాశ్ భాస్కరన్ తో కలిసి ధనుషే నిర్మిస్తున్నాడు. ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కాబోతోంది. గత యేడాది ధనుష్ ‘కెప్టెన్ మిల్లర్, రాయన్’ చిత్రాలు ఆశించిన స్థాయిలో సక్సెస్ ను అందుకోలేదు. మరి ఈ చిత్రమైనా ఆ లోటును తీర్చుతుందేమో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Motorola: మోటరోలా కొత్త స్మార్ట్‌ ఫోన్, బడ్జెట్‌లోనే అధిరిపోయే ఫీచర్స్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *