DS 2: ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘కుబేర’ పోస్టర్లు సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఆశ్చర్యకర విషయం ఏమిటంటే.. ‘కుబేర’ రిలీజ్ కాకముందే దర్శకుడు శేఖర్ కమ్ములతో ధనుష్ మరో సినిమాకు సిద్ధమయ్యాడు. ‘కుబేర’ షూటింగ్ సమయంలోనే శేఖర్ ఓ కొత్త కథను ధనుష్‌కు వినిపించగా, ఈ తమిళ్ స్టార్ వెంటనే ఓకే చెప్పాడట. ఈ కొత్త ప్రాజెక్ట్‌ను కూడా ‘కుబేర’ నిర్మాణ సంస్థ ఏషియన్ సినిమాస్ బ్యానర్‌పైనే రూపొందించనున్నారు. ఇది శేఖర్ కమ్ముల టాలెంట్‌కు నిదర్శనమని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. చేస్తున్న సినిమా రిలీజ్ కాకముందే మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అంటే.. శేఖర్ స్క్రిప్ట్‌పై ధనుష్‌కు ఉన్న నమ్మకం అర్థమవుతోంది. ‘కుబేర’తో పాటు ఈ కొత్త సినిమా కూడా ప్రేక్షకులను అలరిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. శేఖర్-ధనుష్ కాంబో మరోసారి సంచలనం సృష్టించేందుకు రెడీ అవుతోందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఈ రెండు సినిమాలతో బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ చేస్తారో చూడాలి.
