Arunachalam

Arunachalam : అరుణాచలం వెళ్తే భక్తులు గిరిప్రదక్షణలో ఈ తప్పులు చేయకండి

Arunachalam : అరుణాచలం పంచభూతలింగ క్షేత్రాలలో ఒకటి. దక్షిణభారతంలో వెలసిన పంచలింగ క్షేత్రములలో ఒకటి.. అరుణాచలం అనగా అరుణ – ఎర్రని, అచలం – కొండ. ఎర్రని కొండ అని తాత్పర్యం. అ-రుణ అంటే పాపములను పరిహరించునది అని అర్ధం. తమిళంలో “తిరువణ్ణామలై” అంటారు. అరుణాచలేశ్వర దేవాలయం శివాజ్ఞచేత విశ్వకర్మచే నిర్మింపబడిందనీ, దాని చుట్టూ అరుణమనే పురం నిర్మింపబడినదనీ పురాణాలు తెలుపుతున్నాయి. ఈ అరుణాచలం పరమేశ్వరుని జ్యోతిర్లంగ స్వరూపం కావటంవలన దీనిని చుట్టూ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం అని భక్తుల విశ్వాసం. అయితే అరుణాచలం వెళ్తే భక్తులు గిరిప్రదక్షణలో ఈ తప్పులు చేయవద్దు అవెంటో తెలుసుకుందాం.

గిరిప్రదక్షణం చెప్పులు లేకుండా చేయాలి.
బరువు ఎక్కువగా ఉన్నవాటిని మీ కూడా తీసుకువెళ్ళకండి (సంచులు అలాంటివి)
గిరిప్రదక్షణం 14 కి.మీ దూరం ఉంటుంది.
ఉదయం పూట గిరిప్రదక్షణం చేయడం చాలా కష్టం. 9 లోపు ముగించడం మంచిది .
గిరి ప్రదక్షణం పౌర్ణమి రోజు ఎక్కువ మంది చేస్తారు.
అరుణగిరి ప్రదక్షిణ మొదలు పెట్టాక ఎలాంటి కోరికలు కోర రాదు ప్రదక్షిణ నిష్కామంగా కొనసాగించాలి.
చిల్లర తిసుకువెళ్ళడం మరిచిపొవద్దు.
గిరిప్రదక్షణంలో “నేర్ (ఎదురుగా) శివాలయం” అని ఉంది దానికర్ధం శిఖరానికి ఎదురుగా ఉన్న శివాలయం అని.
నిత్యానంద స్వామి అశ్రమం పక్కనే భక్త కన్నప్ప ఆలయం ఉంటుంది.
గిరిప్రదక్షణం ప్రతిరోజూ చేస్తారు .
అరుణగిరి ప్రదక్షిణ చేసేటప్పుడు తల పైన టోపీ లాంటివి ధరించకూడదు.
అరుణాచల గిరి ప్రదక్షిణలో తప్పనిసరిగా అది అన్నామలై దేవాలయం తప్పక సందర్శించండి.
గిరి ప్రదక్షిణలో మీకు తోచిన సహాయం చెయ్యండి.
ఎంత త్వరగా గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము అనేది కాకుండా, నిండు గర్భిణి వలే నిదానంగా అరుణాచల నామస్మరణ చేస్తూ వెళ్ళండి.

గిరి ప్రదక్షిణలో ప్రతి దేవాలయం వద్ద విభూతి ప్రసాదంగా ఇస్తారు అది తప్పక తీసుకోండి.
మీకు కుదిరితే ప్రదక్షిణలో కొద్ది మందికి అయినా అన్నం దానం చెయ్యండి.విశేష ఫలితం కలుగుతుంది.
అరుణాచలంలో గిరి ప్రదక్షిణ మొదలుపెట్టడానికి ముందు తప్పనిసరిగా రాజగోపురం ముందు ఒక దీపం పెట్టి మనసులో ” స్వామి నాకు ఏది ఇస్తే నేను ఆనందంగా ఉంటానో అదే నాకు ప్రసాధించు ” అని కోరుకొని బయలుదేరండి.గిరి ప్రదక్షిణ మొత్తం శివ నామస్మరణ చేస్తూ వెళ్ళండి.

Also Read: Astrology Tips: మీ పిల్లలు ఈ రోజుల్లో పుట్టారా.. అయితే వాళ్ల భవిష్యత్తుకు తిరుగే ఉండదు

Arunachalam : గిరి ప్రదక్షిణలో మీతో పాటు కొంచెం చిల్లర వెంట పెట్టుకొని వెళ్ళండి. సాధువులు ఎంతో మంది ఆ ప్రదక్షిణలో వుంటారు కాబట్టి వారికి తోచిన సహాయం చెయ్యండి.
గిరి ప్రదక్షిణ మొత్తం తారు రోడ్డు కాబట్టి వీలైతే ఉదయం 10 లోపు పూర్తి చెయ్యండి.సాయంత్రం 4 తరువాత మొదలు పెట్టండి.
గిరి ప్రదక్షిణలో రమణ మహర్షి ఆశ్రమం తప్పక సందర్శించండి. అక్కడ ఆశ్రమంలో ధ్యాన మందిరంలో ధ్యానం చేస్తే, విశేషమైన మానసిక ఆనందం కలుగుతుంది అని చాలా మంది అనుభవంతో చెప్పారు.

సంతానం కోసం, వివాహం కానివారు గిరి ప్రదక్షిణలో దుర్వాస మహార్శి దేవాలయం పక్కన ఒక చెట్టుకు తాడు కడతారు ( తాడు అక్కడ అమ్ముతుంటారు).అది చాలా చక్కని ఫలితం ఇస్తుంది.
గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు సాధ్యమైనన్ని సార్లు గిరికి నమస్కరిస్తూ ఓం అరుణాచల శివ అని స్మరణ చేస్తూ వెళ్ళండి.
గిరి ప్రదక్షిణ కేవలం మనకు ఎడమవైపున మాత్రమే చెయ్యాలి. ఎందుకంటె కుడివైపు దేవతలు, సిద్దులు అదృశ్య రూపంలో గిరికి ప్రదక్షిణ చేస్తుంటారు. కాబట్టి మనం వారికి ఎదురుగా వెళ్ళకూడదు.

 

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *