Tirumal: తిరుమలలో ఆదివారం భక్తుల రద్దీ భారీగా పెరిగింది. కార్తీకమాసం ఆరంభం కావడంతో శనివారమే పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సెలవు దినం కావడంతో ఆదివారం వచ్చిన భక్తులతో వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. వెలుపలి వరకు భక్తులు వేచి ఉన్నారు. టోకెన్ లేని భక్తులకు స్వామివారిని దర్శించుకునేందుకు సుమారు 18 గంటల సమయం పడుతుంది. శనివారం 88,076 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
Tirumal: స్వామివారికి 33,236 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారికి హుండీ ఆదాయం రూ.3.52 కోట్లు సమకూరినట్టు వెల్లడించారు. ఈ నెల 5న నాగుల చవితి సందర్భంగా శ్రీవారికి పెద్ద శేష వాహనసే నిర్వహించనున్నారు. 8న పుష్పయాగానికి అంకురార్పణ, 9న మలయప్పస్వామికి పుష్పార్చన జరుగుతుందని అధికారులు తెలిపారు. ఈ నెల 13న సూర్యోదయానికి ముందే తిరుమాడ వీధుల్లో శ్రీదేవి, భూదేవి సమేతుడైన ఉగ్రశ్రీనివాసమూర్తి ఊరేగనున్నారు. 15న కార్తీక పౌర్ణమి సందర్భంగా గరుడ వాహనంపై శ్రీవారు దర్శనం ఇవ్వనున్నారు.