devara

devara: దీపావళిలకే ఓటీటీలో ‘దేవర’!?

devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులకు గుడ్ న్యూస్. జూనియర్ నటించిన ‘దేవర’ అనుకున్న దానికంటే ముందుగా ఓటీటీలో సందడి చేయబోతోంది. ఎన్టీఆర్ కెరీర్ లో సోలో హీరోగా 400 కోట్ల వసూళ్ళు ను సాధించి రికార్డ్ సృష్టించిన చిత్రం ‘దేవర’. కొరటాల కమ్ బ్యాక్ మూవీగా నిలిచిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. ముందు నవంబర్ 8న స్ట్రీమింగ్ అనుకున్నప్పటికీ దక్షిణాది భాషల్లో దీపావళికే అలరించబోతోందట.

హిందీ వెర్షన్ మాత్రం నవంబర్ మూడోవారంలో స్ట్రీమింగ్ కానుంది. థియేట్రికల్ రన్ ముగిసినందున ముందుగానే ఓటీటీలోకి రానున్నట్లు సమాచారం. ఈ సినిమా సాధించిన విజయం అటు ఎన్టీఆర్ కు ఇటు కొరటాలకు కూడా కీలకంగా మారింది. రాజమౌళి సెంటిమెంట్ ను పక్కనపెట్టి మరీ ‘దేవర’ పార్ట్ వన్ ఘన విజయం సాధించటంతో ‘దేవర2’ పై అంచనాలు భారీగా పెరిగాయి. మరి థియేటర్లలో రికార్డ్ వసూళ్లను సాధించిన ‘దేవర’ ఓటీటీలో ఎలాంటి ఆదరణ పొందుతుందో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *