Devara Movie Review: RRR తరువాత NTR నుంచి వచ్చిన సినిమా. కల్కి తరువాత ఈ ఏడాది థియేటర్లను పలకరిస్తున్న భారీ సినిమా. ఆచార్య ప్లాఫ్ తరువాత కొరటాల దర్శకత్వంలో రూపొందిన సినిమా. “దేవర”. NTR 30 వ సినిమాగా ఫుల్ హైప్ తో విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలు అందుకుందా? కొరటాల మళ్ళీ తన మార్కుతో హిట్ కొట్టాడా? తెలియాలంటే ఈ రివ్యూలోకి వెళ్ళిపోవాలి.
Devara Movie Review: సినిమా 1996 ప్రాంతంలో మొదలవుతుంది. ఒక నేరస్తుడిని పట్టుకోవడానికి పోలీస్ ఆఫీసర్ చేసే ప్రయత్నంతో కథ ప్రారంభం అవుతుంది. ఆ తరువాత అది ఎర్ర సముద్రం మీదుగా దేవర దగ్గరకు చేరుతుంది. అది మళ్ళీ 1970ల నాటి కాలం. ఇక్కడ దేవర ఎవరు? ఏమి చేశాడు? అసలు దేవరకు.. పోలీస్ ఆఫీసర్ వెతుకుతున్న నేరస్తుడికి లింక్ ఏమిటి? ఇవన్నీ సినిమాలో చూడాల్సిందే.
Devara Movie Review: సినిమా కథ పక్కా మాస్ ఓరియంటెడ్. NTR రెండు షేడ్స్ ఉన్న పాత్రలను తనదైన శైలిలో చించేశాడు. అభిమానులతో ఈలలు వేయించాడు. NTR పెరఫార్మెన్స్ సినిమాకి పెద్ద ఎసెట్. మాస్ లుక్.. క్లాసీ టచ్ రెండూ కలిపి NTR సినిమాకి ప్రాణం పోసాడు. సినిమాలో చెప్పుకోవాల్సింది ఇదే. ఇక జాన్వీ కపూర్ ఉంది అంటే.. ఉంది. సినిమాకి ఓ హీరోయిన్ అవసరం కాబట్టి.. కమర్షియల్ అవసరాల కోసం కొత్తదనం కావాలి కాబట్టి జాన్వీ ఉండాలని సినిమా యూనిట్ అనుకుందేమో.. అందుకే ఆమెను తీసుకున్నారేమో కానీ, జాన్వీ కపూర్ మాత్రం అసలు సినిమాలో ఎందుకు ఉంది అనేది అర్ధం కాని పరిస్థితి. ఉన్నంతలో శృతి మరాఠీ, తాళ్ళూరి రామేశ్వరి చక్కగా చేశారు. ఇక సైఫ్ ఆలీ ఖాన్ విలన్ గా ఫర్వాలేదనిపించాడు. హరితేజ, గెటప్ శ్రీనులు కామెడీ పంచుతారని ఆశించినా.. పెద్దగా వర్కౌట్ కాలేదు. ఇక మిగిలిన క్యారెక్టర్స్ అన్నీ ఇలా.. అలా వచ్చి వెళ్లిపోయేవే. వాళ్ళవరకూ వారు ఫర్వాలేదు.
Devara Movie Review: టెక్నీకల్ గా దేవర సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అక్కడక్కడా గ్రాఫిక్స్ బాగానే అనిపించాయి. ముఖ్యంగా సముద్రం సీన్స్ లో సీజే వర్క్ బాగా వచ్చింది. మ్యూజిక్ పరంగా చూసుకుంటే సో.. సో.. గా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఫర్వాలేదు అనే స్థాయిలోనే ఉంది. సాంగ్స్ విషయానికి వస్తే పెద్దగా ఆకట్టుకునేలా లేవు. ఒక్క పాట వినడానికి.. చూడటానికి బావుంది అనిపిస్తుంది.
Also Read: ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం రోడ్డు.. ముఖ్యమంత్రి ప్రకటన.. అభిమానుల ఆనందం!
మొత్తంగా చూసుకుంటే, సినిమా ఫర్వాలేదు అనే స్థాయిలోనే ఉందని చెప్పాలి. కొరటాల-NTR కాంబినేషన్ లో సినిమా అనగానే ఏదైనా ఎక్కువగా ఊహించుకుని థియేటర్ కి వెళితే నిరాశ తప్పదు. NTR ఒక్కడే సినిమాని మోశాడని చెప్పడం కరెక్ట్ అవుతుంది. NTR కోసమే ఈ సినిమా చూడొచ్చు అంతే!
చివరిగా.. రొటీన్ కథని వెనక్కి ముందుకి తిప్పి.. స్టార్ క్యాస్టింగ్ చేర్చి.. భారీ హంగామా చేస్తే పాన్ ఇండియా సినిమా అయిపోతుంది అనుకున్నట్టున్నారు మేకర్స్!
సినిమాలో ప్రధానంగా ఉన్నది వీరే..
ఎన్టీఆర్, సైఫ్ అలీ ఖాన్, జాన్వీ కపూర్, శృతి మరాఠే, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, తాళ్లూరి రామేశ్వరి, మురళీ శర్మ, అభిమన్యు సింగ్, తదితరులు.
టెక్నీకల్ టీమ్..
సినిమాటోగ్రఫీ: ఆర్. రత్నవేలు
ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్
సంగీతం: అనిరుధ్ రవిచందర్
నిర్మాత: సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ
దర్శకత్వం: కొరటాల శివ
Devara Movie Review రివ్యూయర్ రేటింగ్: 2.5/5
గమనిక: ఈ సినిమా రివ్యూ రచయిత అభిప్రాయం మాత్రమే. ఈ రివ్యూ ఆధారంగా సినిమా చూడాలని కానీ.. చూడవద్దని కానీ మహా న్యూస్ ఎక్కడా చెప్పడం లేదు. గమనించగలరు.