Devara

Devara: ‘దేవర’ జపాన్‌లో సంచలనం!

Devara: యంగ్ టైగర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా కొరటాల శివ డైరెక్షన్‌లో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘దేవర’ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోంది. తెలుగు రాష్ట్రాలతో పాటు యూఎస్ మార్కెట్‌లో రికార్డు వసూళ్లతో సంచలనం సృష్టించిన ఈ చిత్రం, ఇప్పుడు జపాన్‌లోనూ అదే జోరు చూపిస్తోంది. ఇటీవల జపాన్‌లో రిలీజైన ‘దేవర’ అక్కడ విజయవంతంగా మూడు వారాల రన్‌ను పూర్తి చేసి, నాలుగో వారంలోకి స్టెప్ పెట్టింది. ఈ సాలిడ్ రన్‌తో జపాన్‌లోనూ ‘దేవర’ సూపర్ సక్సెస్ అందుకుందని చెప్పవచ్చు.

Also Read: Hit-3: ‘హిట్-3’ టాలీవుడ్‌కు జోష్ తెస్తుందా?

Devara: ఎన్టీఆర్ యాక్టింగ్, కొరటాల శివ డైరెక్షన్, అనిరుద్ సంగీతం ఈ చిత్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాయి. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం, ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సృష్టించింది. ఇక, అభిమానులకు మరో గుడ్ న్యూస్.. ‘దేవర’ సీక్వెల్‌ను త్వరలోనే మేకర్స్ స్టార్ట్ చేయనున్నారు. మరి, ‘దేవర’ మరెన్ని మార్కెట్లలో రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి!

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *