pawan kalyan

Pawan Kalyan: నేడు కడప జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పర్యటన

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్ తొలిసారి కడప జిల్లా లో నేడు పర్యటించనున్నారు. ఉదయం బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి విమానంలో బయలుదేరి నేరుగా కడప ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు పవన్. అక్కడనుంచి కడప మున్సిపల్‌ హైస్కూల్‌లో తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొని మాట్లాడనున్నారు. 

పవన్ కళ్యాణ్ వస్తున్నారు అనితెలియడం తో సవ్యంగా కడప జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. భద్రత ఏర్పాట్లపై ఆరా తీశారు. మాజీ సీఎం జగన్ సొంత జిల్లా కడపకి  డిప్యూటీ హోదాలో పవన్ కళ్యాణ్ వస్తుండటంతో సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Pawan Kalyan: సహకరించని అధికారులు..చెమటలు పట్టించిన పవన్..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *