Bhatti Vikramarka: తెలుగుదేశం యువ నాయకుడు నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలకు తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గట్టి కౌంటర్ ఇచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడొద్దని భట్టి లోకేశ్‌కు హితవు పలికారు. అంతేకాదు, లోకేశ్, కేటీఆర్ మధ్య జరిగిన రహస్య భేటీ గురించి కూడా భట్టి ప్రస్తావించారు.
భట్టి విక్రమార్క మాట్లాడుతూ, “లోకేశ్‌ను కేటీఆర్ సీక్రెట్‌గా ఎందుకు కలిశారో చెప్పాలని మా ముఖ్యమంత్రి (రేవంత్ రెడ్డి) అడిగారు. ఆయన చెప్పినట్లే ఇప్పుడు జరుగుతోంది” అని సంచలన వ్యాఖ్యలు చేశారు. “బనకచర్ల గురించి కేటీఆర్ మాట్లాడిన కొద్ది రోజులకే లోకేశ్ కూడా అదే విషయంపై మాట్లాడుతున్నారు” అని భట్టి ఎత్తి చూపారు.
ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేశ్ మధ్య రహస్య భేటీ జరిగిందని, దాని వెనుక ఏదో రహస్యం ఉందని భట్టి పరోక్షంగా చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

