Demon Slayer

Demon Slayer: డీమన్ స్లేయర్ కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్ తెలుగు ట్రైలర్‌ విడుదల

Demon Slayer: ప్రపంచవ్యాప్తంగా యానిమేకు ఒక బెంచ్ మార్క్ అయిన క్రంచిరోల్, ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “డీమన్ స్లేయర్: కిమెట్సు నో యైబా – ఇన్ఫినిటీ క్యాసిల్” తమిళ, తెలుగు ట్రైలర్లను రిలీజ్ చేసింది. ఈ ఎపిక్ ట్రైలజీ యొక్క ఫస్ట్ పార్ట్ ని భారతదేశంలో 2025 సెప్టెంబర్ 12న ప్రత్యేకంగా థియేటర్లలో మాత్రమే విడుదల అవుతుంది. ఇందులో IMAX, ఇంకా ప్రీమియం లార్జ్ ఫార్మాట్‌లలో కూడా రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా జపనీస్‌లో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో పాటు, ఇంగ్లీష్, హిందీ, తమిళ్, తెలుగు భాషల్లో డబ్బింగ్ చేశారు.

కథ విషయానికి వస్తే : టాంజిరో కామాడో అనే పిల్లోడి ఫ్యామిలీని ఒక రాక్షసుడు చంపేస్తాడు. అతని చెల్లెలు నెజుకో రాక్షసిగా మారుతుంది. ఆమెను మళ్లీ మాములు మనిషిలా తిరిగి మార్చాలనే సంకల్పంతో టాంజిరో డీమన్ స్లేయర్ కార్ప్స్లో చేరతాడు.

ఈ సిరీస్, మనుషులు, రాక్షసుల మధ్య జరిగే విషాదగాథ, interesting కత్తి యుద్ధాలు, ఆకట్టుకునే కారక్టర్స్, కామెడీ సీన్స్ తో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరిస్తుంది.

ఈ సినిమా మొత్తం త్రీ పార్ట్శ్ లో రానుంది : ఈ త్రీ పార్ట్శ్ సినిమాటిక్ మూవీ, అత్యంత ప్రజాదరణ పొందిన అవార్డు గెలుచుకున్న షోనెన్ యానిమే సిరీస్ యొక్క లాస్ట్ ఆర్క్ గా నిలుస్తుంది. ఈ చిత్రాన్ని జపాన్ మరియు కొన్ని ఆసియా దేశాల్లో తప్ప, ప్రపంచవ్యాప్తంగా క్రంచిరోల్ మరియు సోనీ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ వాళ్ళు రిలీజ్ చేయనున్నారు.

సాంకేతిక నిపుణులు :
దర్శకత్వం: హరుఓ సోటోజాకి
స్క్రీన్‌ప్లే మరియు నిర్మాణం: ufotable

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Bollywood: ఒకరు అలా... ఒకరు ఇలా!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *