Delimitation: తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజన అంశపై అంతటా ఉత్కంఠ నెలకొన్నది. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా పునర్విభవజన ఉంటుందని, నియోజకవర్గాలు పెరుగుతాయని సూచనలు కనిపిస్తున్నాయి. దీంతో కొంత వెసులుబాటుకు అవకాశం ఉంటుందని అన్ని పార్టీలు భావిస్తుండగా, ద్వితీయశ్రేణి నాయకత్వంలో ఆశలు చిగిరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాజకీయ సమీకరణాలు కూడా మారనున్నాయి.
Delimitation: నియోజకవర్గాల పునర్విభవజనతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆ సంఖ్య పెరుగుతుందని ఎన్నాళ్ల నుంచో ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కలిపి 84 స్థానాల వరకు పెరగవచ్చని తెలుస్తున్నది. ఏపీలో 50 సీట్లు, తెలంగాణల్లో 34 సీట్లు కొత్తగా పెరుగుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
Delimitation: అయితే 2026లో దేశవ్యాప్త జనగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ దశలో జనగణన అనంతరమే నియోజకవర్గాల పునర్విభజన ఉంటుందని అందరూ భావిస్తున్నారు. ముందస్తు ఎన్నికలు జరపాలనే యోచనలో కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం ఉన్నట్టు వార్తలు అందుతున్నాయి. 2027 లేదా 2028లో జమిలి ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తుందని ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో ఆ ఎన్నికలకు ముందే డీలిమిటేషన్ చేపట్టి నియోజకవర్గాల పునర్విభజన చేపడుతారని అందరూ భావిస్తున్నారు.
Delimitation: నియోజకవర్గాల పునర్విభజన జరిగితే ఏపీలో ఇప్పుడు ఉన్న 175 అసెంబ్లీ స్థానాలకు గాను 50 స్థానాలను పెంచితే మొత్తంగా 225 స్థానాలకు చేరుకుంటుంది. అదే విధంగా తెలంగాణలో 119 స్థానాలకు గాను మరో 34 స్థానాలు 153కు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. అదే విధంగా డీలిమిటేషన్ అనంతరం అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు లోక్‌సభ నియోజకవర్గాలను కూడా పునర్విభజించే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది.