Viral News: కొత్త కారు కొన్న తర్వాత చాలామంది పూజలు చేయించుకోవాలని, తామే ఫస్ట్ డ్రైవ్ చేయాలని ఆశపడుతుంటారు. అయితే అలాంటి ఉత్సాహం ఓ మహిళకు పెద్ద షాక్‌ను ఇచ్చింది. రూ.27 లక్షల విలువ చేసే మహీంద్రా థార్‌ను డెలివరీ తీసుకున్న గంటలోపే ఆమె చేసిన చిన్న పొరపాటు పెద్ద ప్రమాదానికి దారితీసింది. షోరూం ఫస్ట్ ఫ్లోర్ నుంచి కారు కిందపడిపోవడంతో ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఘటన ఎలా జరిగిందంటే..
ఢిల్లీకి చెందిన 29 ఏళ్ల మానీ పవార్ తన భర్త ప్రకీప్‌తో కలిసి నిర్మాణ్ విహార్‌లోని మహీంద్రా షోరూం నుంచి కొత్త థార్ కారును కొనుగోలు చేసింది. కొత్త బండిని ఇంటికి తీసుకెళ్లే ముందు పూజ కోసం నిమ్మకాయ తొక్కించాలని అనుకుంది. అయితే షోరూం ఫస్ట్ ఫ్లోర్‌లో ఉన్న కారులో మానీ కూర్చుని యాక్సిలేటర్‌ను తప్పుగా బలంగా తొక్కడంతో కారు ఒక్కసారిగా వేగంగా ముందుకు దూసుకెళ్లింది. షోరూం గ్లాస్‌ను పగులగొట్టి, సుమారు 15 అడుగుల ఎత్తు నుంచి కిందపడిపోయింది.
డెలివరీ రోజే.. డ్యామేజ్ అయిన థార్ కార్
తూర్పు ఢిల్లీలో ఓ మహిళ 27 లక్షలు పెట్టీ థార్ కార్ కొనుగోలు చేసింది. ఫస్ట్ ఫ్లోర్ లో డెలివరీ తీసుకుంది.
స్టార్ట్ చేసి నిమ్మకాయి తొక్కించాలని అనుకోని కంగారులో యాక్సిలరేటర్ ను గెట్టిగా తొక్కింది, షోరూం అద్దాలు పగలుగొట్టుకొని కారు కింద… pic.twitter.com/S2iidqkDtU
— greatandhra (@greatandhranews) September 10, 2025
ఇది కూడా చదవండి: Nepal Protest: చంపడానికి వస్తున్నారు.. మమ్మల్ని కాపాడండి.. నేపాల్లో చిక్కుకున్న భారత మహిళ
షోరూం ఉద్యోగి, ఎయిర్‌బ్యాగ్‌ల సహాయం
అప్రమత్తమైన సిబ్బంది వెంటనే స్పందించి మానీ పవార్‌తో పాటు కారులో ఉన్న షోరూం ఉద్యోగి వికాస్‌ను సమీపంలోని మాలిక్ ఆస్పత్రికి తరలించారు. ఎయిర్‌బ్యాగ్‌లు సమయానికి తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పిందని పోలీసులు వెల్లడించారు. ప్రస్తుతం ఇద్దరూ సురక్షితంగా ఉన్నారని సమాచారం.
వివిధ కథనాలు… సోషల్ మీడియాలో హడావుడి
ఈ ప్రమాదానికి కారణం ఎవరోపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. కొందరు మీడియా కథనాలు షోరూం సిబ్బంది డెమో ఇస్తుండగా ఈ ప్రమాదం జరిగిందని చెబుతున్నాయి. మరోవైపు, మానీ పవార్ స్వయంగా డ్రైవ్ చేయాలని ప్రయత్నించడంతో ఈ ఘటన జరిగిందని మరో వర్గం అంటోంది. ఏదేమైనా, ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఘటనపై వ్యంగ్యంగా స్పందిస్తూ ఆనంద్ మహీంద్రా స్పందించాలంటూ కోరుతున్నారు.