Delhi:

Delhi: పోలీసుల‌ అనుమానమే నిజ‌మైంది.. ఢిల్లీలో ముగ్గురి దారుణహ‌త్య‌

Delhi: ఢిల్లీ న‌గ‌రంలో దారుణం చోటుచేసుకున్న‌ది. భ‌ర్త‌, భార్య‌, కూతురు స‌హా హ‌త్య‌కు గుర‌య్యారు. ఒకే ఇంటిలో ర‌క్త‌పు మ‌డుగులో వారు ప‌డి ఉన్నారు. త‌ను వాకింగ్‌కు వెళ్లొచ్చేస‌రికి త‌న త‌ల్లిదండ్రుల‌ను, సోద‌రిని ఎవ‌రో హ‌త్య చేశారంటూ గుక్క‌పెట్టి ఏడుస్తూ వారి కొడుకు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యాడు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని విచారించారు. పోలీసులు త‌మ‌దైన శైలిలో ప‌రిశీలించ‌గా, అస‌లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దారుణ ఘ‌ట‌న తెలిసి కండ్లు బైర్లు క‌మ్ముకునేంత ప‌నైంది.

Delhi: ఢిల్లీ న‌గ‌రంలోని నెబ్ స‌రాయ్ ప్రాంతానికి చెందిన రాజేశ్‌కుమార్ 951), ఆయ‌న భార్య కోమ‌ల్ (46), వారి కూతురు క‌విత (23) స‌హా వారి కొడుకు అర్జున్‌తో క‌లిసి నివాసం ఉంటున్నారు. డిసెంబ‌ర్ 4న బుధ‌వారం రాజేశ్‌కుమార్ దంప‌తుల వివాహ వార్షికోత్స‌వ రోజు. అయితే బుధ‌వారం తెల్ల‌వారు జామునే రాజేశ్‌కుమార్, కోమ‌ల్‌, క‌విత త‌మ ఇంటిలో క‌త్తిపోట్ల‌తో ర‌క్త‌పు మ‌డుగులో ప‌డి ఉన్నారు.

Delhi: మార్నింగ్‌వాక్‌కు వెళ్లొచ్చిన అర్జున్‌.. మొద‌టి అంత‌స్తులో రాజేశ్ మృత‌దేహం, గ్రౌండ్ ఫ్లోర్‌లో కోమ‌ల్‌, క‌విత మృత‌దేహాలు క‌నిపించాయి. దీంతో వెంట‌నే అర్జున్‌ ఇరుగు పొరుగు వారికి చెప్పి పోలీసుల‌కూ స‌మాచారం ఇచ్చాడు. తాను మార్నింగ్ వాక్‌కు వెళ్లొచ్చేస‌రికే ఈ దారుణం జ‌రిగింది.. ఎవ‌రు చంపెళ్లారో.. అంటూ అర్జున్ తీవ్ర దుఃఖ‌సాగ‌రంలో మునిగిపోయాడు. గుక్క‌పెట్టి మ‌రీ ఏడ్వ‌సాగాడు. అయ్యోపాపం తల్లిదండ్రులు, సోద‌రి మ‌ర‌ణంతో అర్జున్ ఒంటిరివాడ‌య్యాడు క‌దా.. అంటూ ఇరుగు పొరుగు సానుభూతి వ‌చ‌నాలు ప‌లికారు.

Delhi: పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి వ‌చ్చి ప‌రిశీలించారు. ఎవ‌రి పైనైనా అనుమానం ఉన్న‌దా? ఎవ‌రు చంపి ఉంటారు? ఆస్తిపాస్తులు, అప్పుల వివ‌రాలు సేక‌రించారు. అయితే అర్జున్ మాట‌ల్లో పోలీసులు త‌డ‌బాటును గ‌మ‌నించి త‌మ‌దైన శైలిలో విచార‌ణ జ‌రిపారు. దీంతో అస‌లు విష‌యం బ‌ట్ట‌బ‌య‌లైంది. ఆ ముగ్గురినీ తానే మ‌ర్డ‌ర్ చేసిన‌ట్టు అర్జున్ ఒప్పుకున్నాడు. అయ్యో సొంత తల్లిదండ్రుల‌ను, సోద‌రిని చంపేసిండా, ఇంత దుర్మార్గుడా అంటూ అదే ఇరుగు పొరుగు శాప‌నార్థాలు పెట్ట‌సాగారు.

Delhi: అస‌లు విష‌యం ఏమిటంటే? అర్జున్ చ‌దువు విష‌యంలో రాజేశ్‌కుమార్ త‌ర‌చూ తిడుతుండేవాడు. ఈ విష‌యాన్ని త‌ల్లి కానీ, సోద‌రి కానీ త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌వ‌క‌పోవ‌డంతో తాను ఒంటిరి వాడిన‌ని మ‌న‌స్థాపం చెందాడు. అదే విధంగా ఆస్తినంతా త‌న సోద‌రి పేరున త‌ల్లిదండ్రులు రాసిచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని అర్జున్‌లో అనుమానం పెరిగింది. దీంతో ఎలాగైనా ఆ ముగ్గురిని హ‌త‌మార్చాల‌నే ప్లాన్ చేశాడు. వేసుకున్న ప్లాన్ ప్ర‌కారం నిద్ర‌లో ఉండ‌గానే త‌ల్లిదండ్రుల‌తోపాటు సోద‌రిని క‌త్తితో పొడిచి చంపిన‌ట్టు పోలీసుల విచార‌ణ‌లో అర్జున్ అస‌లు నిజాల‌ను క‌క్కేశాడు.

Delhi: ఈ ఘ‌ట‌న‌తో మాన‌వ విలువలు ఎంత‌గా దిగ‌జారుతున్నాయో తెలుస్తున్న‌ది. కుటుంబ బంధాలకూ విలువ లేకుండా పోతున్న‌ది. మ‌నుషుల్లో మాన‌వ‌త్వం స్థానంలో దాన‌వ‌త్వం పెరుతుంద‌న‌డంలో ఈ ఘ‌ట‌నే తార్కానం. మంచి, చెడు విచ‌క్ష‌ణ కోల్పోయిన మ‌నిషి ఎంత‌కైనా తెగిస్తాడ‌న‌డానికి ఇదే నిద‌ర్శ‌నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *